AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెల్ కమ్ అంటూనే కండీషన్స్ అప్లై.. వల్లభనేనికి జగన్ షాక్ !

తెలంగాణాలో ఇప్పటికే కనుమరుగైన తెలుగుదేశం పార్టీకి ఏపీలో పరిణామాలు కూడా మింగుడు పడని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు టిడిపి నేతలు.. వైసీపీలోనో.. బిజెపిలోనో చేరిపోయారు. వారి బాటలోనే మరికొందరి పేర్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వీరిలో ప్రధానంగా మార్మోగుతున్న పేరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 2019 మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి సొంత పార్టీతో అంటీముంట్టనట్లుగా వుంటూ వస్తున్ వల్లభనేనిపై పార్టీ మారతారంటూ తరచూ ప్రచారం జరిగింది. ఏనాడు […]

వెల్ కమ్ అంటూనే కండీషన్స్ అప్లై.. వల్లభనేనికి జగన్ షాక్ !
Rajesh Sharma
|

Updated on: Oct 26, 2019 | 1:17 PM

Share

తెలంగాణాలో ఇప్పటికే కనుమరుగైన తెలుగుదేశం పార్టీకి ఏపీలో పరిణామాలు కూడా మింగుడు పడని పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు టిడిపి నేతలు.. వైసీపీలోనో.. బిజెపిలోనో చేరిపోయారు. వారి బాటలోనే మరికొందరి పేర్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. వీరిలో ప్రధానంగా మార్మోగుతున్న పేరు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. 2019 మే నెలలో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి సొంత పార్టీతో అంటీముంట్టనట్లుగా వుంటూ వస్తున్ వల్లభనేనిపై పార్టీ మారతారంటూ తరచూ ప్రచారం జరిగింది.

ఏనాడు వాటిపై నేరుగా స్పందించని వల్లభనేని వంశీ.. నిన్న సడన్‌గా వార్తల్లో ముఖ్య నేతగా కనిపించారు. ఉదయమే బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో వల్లభనేని భేటీ అయ్యారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు వల్లభనేని. దాంతో ఆయన వైసీపీలో చేరిపోవడం ఖాయమని గట్టి ప్రచారం మొదలైంది.  ఆ తర్వాత కొడాలి నానితోను గంటల కొద్దీ సమాలోచనలు జరిపారు వల్లభనేని వంశీ. ఇంతకూ వైసీపీలో చేరేది వుందా లేదా అని కాస్త లోతుగా పరిశీలిస్తే.. విచారిస్తే తేలిన సంగతి కాస్త షాక్‌కు గురిచేసేదిలా కనిపిస్తోంది.

కండీషన్స్ అప్లై అన్న జగన్ !

వైసీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ పట్ల వైఎస్ జగన్ సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ.. ఆ తర్వాత చెప్పిన మాటలు వంశీని షాక్‌కు గురిచేసినట్లు విశ్వసనీయ సమాచారం. భారీ మెజారిటీతో.. బంపర్ సీట్లతో అధికారంలోకి వచ్చిన తమకు ఇతర పార్టీలను బలహీనపరచాల్సిన అవసరం లేదని జగన్ మరోసారి తేటతెల్లంగా చెప్పినట్లు తెలిసింది. ఎన్నికల తర్వాత పలు సందర్భాలలో చెప్పినట్లే.. ఎవరైనా పార్టీ మారాలనుకుంటే.. తమ పార్టీకి రాజీనామా చేయడంతోపాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ సూచించినట్లు సమాచారం. వైసీపీలో చేరిన తర్వాత తిరిగి గెలుస్తామన్న నమ్మకం, సత్తా వున్న వారే పార్టీలోకి రావాలని.. అదే కండీషన్ నీకు వర్తిస్తుందని వంశీకి ఖరాఖండీగా చెప్పినట్లు సీఎంవో వర్గాలంటున్నాయి.

గతంలో వైసీపీ తరపున గెలిచిన వారిని ఏకపక్షంగా చేర్చుకుని, అనర్హత పిటిషన్లను పెండింగ్‌లో పెట్టిన టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మండిపడిన జగన్మోహన్ రెడ్డి.. తాను అదే తీరుగా వ్యవహరించలేనని తేటతెల్లంగా చెప్పేసినట్లు సమాచారం. జగన్ సూచనతో వల్లభనేని కాస్త నొచ్చుకున్నా.. తన సత్తాపై నమ్మకంతో వైసీపీలో చేరేందుకే మొగ్గుచూపారని.. దీపావళి పండగ తర్వాత ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని తాజా సమాచారం. అయితే. వంశీ రాకను గన్నవరంలోని వైసీపీ వర్గాలు ముఖ్యంగా నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు ఆందోళన నిర్వహిస్తుండడంతో ముందుగా యార్లగడ్డను మెప్పించుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

Follow Us