AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా!

ఇటీవలి కాలంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార లేబర్ పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి, పలువురు ఎంపీలు, సీనియర్ నేతల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. స్టార్మర్ నిర్ణయం బ్రిటన్ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం.. ప్రధాని పదవికి కీర్ స్టార్మర్ రాజీనామా!
Britain Pm Keir Starmer
Balaraju Goud
|

Updated on: Jun 22, 2026 | 2:31 PM

Share

ఇటీవలి కాలంలో తీవ్ర రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధికార లేబర్ పార్టీలో పెరుగుతున్న అసంతృప్తి, పలువురు ఎంపీలు, సీనియర్ నేతల నుంచి వచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. స్టార్మర్ నిర్ణయం బ్రిటన్ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తున్నారు.

రెండేళ్ల క్రితం భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన స్టార్మర్ ప్రభుత్వం ఇటీవల ప్రజాదరణ కోల్పోవడంతో పాటు పలు ఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్నది. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితాలు రాకపోవడం, ఆర్థిక పరిస్థితులపై విమర్శలు పెరగడం, ప్రభుత్వ విధానాలపై పార్టీ అంతర్గత విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో ఆయన నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తాయి.

రాజీనామా ప్రకటన సందర్భంగా స్టార్మర్ మాట్లాడుతూ, లేబర్ పార్టీని తదుపరి సాధారణ ఎన్నికలకు నడిపించడానికి తాను సరైన వ్యక్తిని కాదని భావిస్తున్నానని తెలిపారు. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొత్త నాయకుడి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతలు కొనసాగించి, సెప్టెంబర్ నాటికి అధికార బదిలీ పూర్తి అవుతుందని వెల్లడించారు.

ఇక స్టార్మర్ రాజీనామాతో లేబర్ పార్టీలో నాయకత్వ పోరు ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కీలక నేతగా ఎదిగిన ఆండీ ఆండీ బర్న్‌హామ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే కొత్త నాయకుడి ఎంపికపై అధికారిక ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. స్టార్మర్ నిర్ణయం బ్రిటన్ రాజకీయాల్లో కీలక మలుపుగా మారిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర