ఇవి ఇళ్లు కాదు.. అంతకుమించే.. ధోనీ నుంచి కోహ్లీ వరకు ఎవరెంత ఖర్చు చేశారో తెలుసా..?
Multi Crore Worth Homes of Indian Cricketers: కష్టపడి సంపాదించిన సొమ్మును వ్యాపారాల్లో పెట్టడమే కాకుండా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులుగా మారుస్తూ భారత క్రికెటర్లు తమ ఆర్థిక భవిష్యత్తును పటిష్టం చేసుకుంటున్నారు. ఆట నుంచి పొందే భారీ పారితోషికాలు, బ్రాండ్ ప్రకటనల ద్వారా వచ్చే రాబడితో దేశంలోని ప్రధాన నగరాల్లో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రతి ఇల్లు కూడా ఆయా ఆటగాళ్ల వ్యక్తిత్వానికి, ఇష్టాయిష్టాలకు ప్రతిబింబంగా నిలుస్తోంది.

Multi Crore Worth Homes of Indian Cricketers: భారత క్రికెట్ దిగ్గజాలు మైదానంలో పరుగుల వర్షం కురిపించడమే కాకుండా బిలియనీర్ల తరహాలో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, వీరేందర్ సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ దేశవ్యాప్తంగా నిర్మించుకున్న వందల కోట్ల విలువైన విలాసవంతమైన భవనాలు, వాటిలోని అద్భుతమైన సౌకర్యాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
రాంచిలో ధోనీ 7 ఎకరాల ఫామ్‌హౌస్.. సెహ్వాగ్ రూ.130 కోట్ల బంగ్లా!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి బైక్‌లు, కార్లంటే ఎంతటి పిచ్చి ఉందో అందరికీ తెలిసిందే. రాంచిలోని తన సొంత ఊరిలో 7 ఎకరాల భారీ విస్తీర్ణంలో ‘కైలాసపతి’ పేరుతో రూ.100 కోట్లకు పైగా విలువైన ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. ఆధునిక డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ బంగ్లాలో అత్యాధునిక జిమ్, ఈత కొలను, ఇండోర్ క్రీడా ప్రాంగణాలు ఉన్నాయి. ఆయన దగ్గర ఉన్న పదుల సంఖ్యలోని సూపర్‌బైక్‌లు, లగ్జరీ కార్ల కోసం ప్రత్యేకంగా ఒక పెద్ద గ్యారేజ్‌ను ఏర్పాటు చేయడం ఈ భవనం ప్రత్యేకత.
మరోవైపు డేంజరస్ బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ నజఫ్‌గఢ్ వీధుల నుంచి హౌజ్ ఖాస్‌లోని రాజభవనం వరకు సాగించిన ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లో సెహ్వాగ్‌కు ఉన్న ‘కృష్ణ నివాస్’ బంగ్లా విలువ సుమారు రూ.130 కోట్లుగా అంచనా. ఇందులో 12 విశాలమైన గదులు, ప్రాంగణంలో అందమైన కోవెల, పెంచుకునే కుక్కల కోసం ప్రత్యేకమైన లాన్ ఉన్నాయి. హర్యానా, నజఫ్‌గఢ్‌లలో కూడా ఆయనకు అనేక రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి.
గురుగ్రామ్‌లో కోహ్లీ రాజభవనం.. ముంబైలో సచిన్ కలల సౌధం!
భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీకి ముంబై, లండన్, అలీబాగ్ ప్రాంతాలలో విలాసవంతమైన ఆస్తులు ఉన్నాయి. అయితే అన్నింటికంటే విలువైనది గురుగ్రామ్‌లోని డిఎల్ఎఫ్ సిటీ ఫేజ్-1లో ఉన్న రూ.80 కోట్ల విలువైన బంగ్లా. దాదాపు 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ భవనంలో అత్యాధునిక జిమ్, ట్రెండీ ఫర్నిచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మైదానంలో ఎంత ఫిట్‌గా ఉంటాడో, ఇంటి డిజైన్‌లోనూ కోహ్లీ అంతే శ్రద్ధ చూపిస్తారు.
క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ‘దోరాబ్ విల్లా’లో నివసిస్తున్నారు. 2007లో ఒక పారసీ కుటుంబం నుంచి ఈ స్థలాన్ని రూ.39 కోట్లకు కొనుగోలు చేశారు. పునర్నిర్మాణ పనుల తర్వాత 2011లో 6,000 చదరపు అడుగుల ఈ ఐదంతస్తుల భవనంలోకి సచిన్ కుటుంబంతో కలిసి మారారు. వర్షాకాలంలో సచిన్ గడపడానికి ఇష్టపడే ఒక పచ్చని తోట ఈ విల్లాలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది.
కోల్‌కతాలో దాదా 50 గదుల మహల్.. రియల్ ఎస్టేట్‌లో క్రికెటర్ల హవా!
‘ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా’గా పేరొందిన సౌరవ్ గంగూలీకి కోల్‌కతాలోని లోయర్ రావ్‌డన్ స్ట్రీట్‌లో రాజభవనాన్ని తలపించే బంగ్లా ఉంది. ప్రస్తుతం దీని విలువ రూ.47 కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. ఈ ప్రాపర్టీలో 50కి పైగా గదులు ఉండటం విశేషం. ప్రాచీన నిర్మాణ శైలితో ఉండే ఈ భవనం గంగూలీ రాయల్ లుక్‌కు తగ్గట్టుగా ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




