AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐదొద్దుల రోజు ఆగమాగం.. కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!

మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య వెలుగు చూసింది. కులపెద్దతో ఘర్షణ పడ్డాడనే ఆగ్రహంతో ఒక వ్యక్తిని తోటి కులస్తులే అత్యంత దారుణంగా రాళ్లు, కర్రలతో కొట్టి చంపారు. తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

ఐదొద్దుల రోజు ఆగమాగం.. కులపెద్దతో గొడవ పడ్డాడని దారుణంగా కొట్టి చంపిన కులస్తులు!
Mahabubabad Murder
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Aug 20, 2026 | 9:24 AM

Share

కులపెద్దతో ఘర్షణ పడ్డాడనే ఆగ్రహంతో ఒక వ్యక్తిని తోటి కులస్తులే అత్యంత కొట్టి చంపిన సఘటన మహబూబాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. మడిపల్లి గ్రామానికి చెందిన రమేష్‌ అనే వ్యక్తి స్థానికంగా ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఇటీవల వీరి కులానికి చెందిన వెంకన్న అనే వ్యక్తి మృతి చెందారు. అయితే మరణించిన వ్యక్తి ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి కావడంతో కులస్తులంతా కలిసి స్థానిక కమ్యూనిటీ హాల్ వద్ద 5వ రోజు శాంతి కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగానే అందరూ కలిసి ఒకే చోట కూర్చొని మద్యం సేవిస్తూ దావత్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి మధ్య చిన్నగా గొడవ స్టార్ట్ అయింది. అయితే అక్కడే ఉన్న రమేష్ తమ కులపెద్ద అయిన యాకయ్యతో ఘర్షణకు దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన తోటి కులస్తులు రమేష్‌పై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. వారి బారి నుంచి తప్పించుకునేందుకు రమేష్ పరుగులు తీసినప్పటికీ, వెంటాడి కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు.

దీంతో ఈ దారుణానికి పాల్పడిన నిందితులు అంతా నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో గ్రామంలో మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర