AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సనత్ నగర్ టిమ్స్‌పై ప్రభుత్వం మరో అప్డేట్.. సాధారణ ప్రజల నుంచి ఛార్జీలు వసూలు.. క్లారిటీ వచ్చేసింది..

సనత్ నగర్ టిమ్స్ సేవలు రేపటి నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభం కానున్నాయి. సోమవారం ఈ హాస్పిటల్‌ను సీఎం రేవంత్ ప్రారంభించగా.. తొలుత ఓపీ సేవలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ఐపీ సేవలు కూడా ప్రారంభించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్లు ప్రారంభం కావడానికి సమయం పట్టే అవకాశముంది.

Hyderabad: సనత్ నగర్ టిమ్స్‌పై ప్రభుత్వం మరో అప్డేట్.. సాధారణ ప్రజల నుంచి ఛార్జీలు వసూలు.. క్లారిటీ వచ్చేసింది..
Tims Sanathnagar Opens With 1082 Beds
Venkatrao Lella
|

Updated on: Aug 20, 2026 | 9:20 AM

Share

తెలంగాణ ప్రజలకు భారీ శుభవార్త. సనత్ నగర్ టిమ్స్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. సోమవారం ఈ హాస్పిటల్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి ఇంకా రాలేదు. ఆగస్ట్ 21వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అన్నీ సేవలు ప్రారంభించనున్నారు. ఇన్‌పేషెంట్(ఐపీ) సేవలు శుక్రవారం నుంచి ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే ఔట్ పేషెంట్(ఓపీ) సేవలు ప్రారంభమవ్వగా.. భారీగా స్పందన వస్తోంది. ట్రయల్ రన్ సమయంలో రోజుకు 200 మంది వరకు హాస్పిటల్‌కు రాగా.. బుధవారం నాటికి ఈ సంఖ్య 700 దాటింది. ప్రతీ రోజు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు ఓపీ రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. మధ్యాహ్నం 2 గంటల వరకు వైద్యులు సేవలు అందిస్తున్నారు.

రేపటి నుంచి పూర్తి స్థాయిలో సేవలు

శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో సేవలు ప్రారంభం కానున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి ఆస్పత్రిని ప్రారంభించిన సందర్బంగా ఆపరేషన్ థియేటర్లు, వార్డులను పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శించారు. ఒకేసారి పెద్ద మొత్తంలో సందర్శకులు రావడంతో బ్యాక్టీరియా ఇన్పెక్షన్ ముప్పు ఏర్పడే అవకాశముంది. దీంతో సిబ్బంది హాస్పిటల్ మొత్తం ప్యూమిగేషన్ ప్రాసెస్ చేపట్టారు. గురువారంతో ప్యూమిగేషన్ ప్రక్రియ పూర్తవ్వగా.. శుక్రవారం నుంచి ఐపీ సేవలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే త్వరలో రెండో దశ ప్యూమిగేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తై బ్యాక్టీరియా పూర్తిగా తొలగిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఆపరేషన్లు ప్రారంభిస్తారు. అయితే ఆపరేషన్లు ప్రారంభం కావడానికి మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశముందని తెలుస్తోంది.

నిమ్స్ తరహాలో చార్జీలు

పేదలకు అత్యున్నత కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ హాస్పిటల్‌ను నిర్మించింది. కార్పొరేట్ ఆస్పత్రులను తలపించే విధంగా దీని నిర్మాణం చేపట్టారు. మొత్తం 1082 పడకలు ఉండగా.. 300 ఐసీయూ బెడ్స్ ఉన్నాయి. ఇప్పటికే ఓపీ, ఐపీ సేవలు ప్రారంభమవ్వగా.. రెండు, మూడు వారాల్లో సర్జరీలు కూడా ప్రారంభమవుతాయి. ఈ ఆస్పత్రిని దాదాపు రూ.1126 కోట్లతో నిర్మించగా.. 2360 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇక్కడ సాధారణ రోగులకు నిమ్స్ మాదిరిగానే ఛార్జీలు వసూలు చేస్తారు. నాలుగు బ్లాకులుగా ఈ హాస్పిటల్ నిర్మించారు. అలాగే ఏఐ ఆధారిత న్యూమాటిక్ ట్యూబ్ వ్యవస్థను తొలిసారిగా ప్రవేశపెట్టారు. దీని వల్ల మెడికల్ టెస్టులు రెండు నిమిషాల్లోనే పూర్తవుతాయి. మొత్తం 31 మేజర్, 6 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. 17 పాథాలజీ ల్యాబ్‌లు, 12 మైక్రో బయాలజీ ల్యాబ్, 10 బయో కెమిస్ట్రీ ల్యాబ్‌లు, 5 ప్రత్యేక ల్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర