AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 20 రూపాయల విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!

కేవలం రూ.20 లంచం తీసుకున్నారనే కేసులో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇద్దరు ప్రభుత్వ ఉద్యోలకు బిగ్‌ రిలీఫ్ లభించింది. లంచం డిమాండ్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లేకుండా, కేవలం రూ.20 స్వాధీనం చేసుకున్నంత మాత్రాన నేరం రుజువైనట్లు కాదని స్పష్టం చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం వారిని నిర్దోషులుగా ప్రకటించింది.

Viral News: 20 రూపాయల విషయంలో కేసు.. 30 ఏళ్ల తర్వాత సుప్రీం కోర్టు సంచలన తీర్పు!
Govt Employees Acquitted In 30 Yr Old Rs.20 Bribery Case
Anand T
|

Updated on: Aug 20, 2026 | 8:32 AM

Share

రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణల కేసులో సుమారు 30 ఏళ్ల ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట లభించింది. ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులను నిర్ధోషులుగా ప్రకటిస్తూ సుప్రీం కోర్లు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ అతుల్ ఎస్. చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉద్యోగులకు ట్రయల్ కోర్టు, గుజరాత్ హైకోర్టులు విధించిన శిక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

అలసేం జరిగింది.

1996లో గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా బెచారి గ్రామానికి చెందిన ఓ విద్యార్థి స్థానికంగా ఉన్న పంచాయతీ కార్యాలయానికి నుంచి ఇన్‌కం సర్ఫిఫికెట్ తీసుకోవడానికి వెళ్లాడు. అయితే సర్టిఫికెట్ ఇచ్చేందుకు అక్కడ ఉన్న ప్యూన్ రూ.120 లంచం అడిగినట్టు ఆరోపిస్తూ ఆ విద్యార్థి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గుర్తుపెట్టిన రూ.120ను విద్యార్థికి ఇచ్చి పంపారు. విద్యార్థి సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత తన దగ్గర ఉన్న రూ.20 నోటును ప్యూన్‌కు ఇచ్చాడు. అప్పుడే అక్కడికి చేరుకున్న అధికారులు ప్యూన్ నుంచి ఆ రూ.20 నోటును స్వాధీనం చేసుకున్నారు. కానీ మిగతా వంద నోటు మాత్రం లభించలేదు.

దీంతో ప్యూన్‌తో పాటు క్లర్క్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు వారిని వారిని ట్రయల్ కోర్టులో హాజరు పర్చగా కోర్టు వారిని శిక్ష విధించినట్టు తెలుస్తోంది. దీంతో ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అక్కడ ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలను పరిగణలోకి తీసుకోగా.. కేసు విచారణలో ప్యూన్ తనను ఎలాంటి లంచం డిమాండ్ చేయలేదని విద్యార్థి స్వయంగా తెలిపినట్టు తేలిందని..అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 20 ప్రకారం ప్రాథమికంగా లంచం డిమాండ్ చేసినట్లు రుజువు కానప్పుడు, కేవలం రికవరీ ఆధారంగా నేరస్థులుగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. దీంతో నిందితులిద్దరినీ సుప్రీంకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!