AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెల్‌ఫోన్‌ ఎక్కడ ఉంది.. ఆ లెటర్ సంగతేంటి..? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. రెండు రోజుల పోలీస్ కస్టడీలో అధికారులు మాయమైన సెల్‌ఫోన్‌, అందులోని చాట్స్‌, కాల్ డేటా, డిజిటల్ ఆధారాలతో పాటు సూసైడ్ నోట్‌ అంశంపై ప్రశ్నించినట్లు సమాచారం. అయితే కొన్ని కీలక ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో పోలీసులు అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను విశ్లేషించడంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కస్టడీ ముగియడంతో ఉదయ్ కృష్ణారెడ్డిని తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.

సెల్‌ఫోన్‌ ఎక్కడ ఉంది.. ఆ లెటర్ సంగతేంటి..? ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌ కృష్ణారెడ్డి కేసులో లేటెస్ట్ అప్డేట్ ఇదే..
Uday Krishna Reddy Case
Shaik Madar Saheb
|

Updated on: Aug 20, 2026 | 8:41 AM

Share

రెండురోజుల పాటు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులకు సరైన సమాధానాలు లభించలేదని తెలుస్తోంది. దీంతో అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించిన ఉదయ్ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో విచారించారు. రెండు రోజుల కస్టడీ ముగియడంతో ఆయనను తిరిగి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. అయితే కస్టడీ విచారణలో పోలీసులు అడిగిన కొన్ని కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సమాచారం. ముఖ్యంగా మాయమైన సెల్‌ఫోన్‌ గురించే పోలీసులు ప్రధానంగా ఆరా తీసినట్లు తెలుస్తోంది. సెల్‌ఫోన్‌ ఎక్కడ ఉంది? దాన్ని ఎందుకు దాచారు? అందులో ఉన్న చాట్స్‌, కాల్‌ డేటా, ఇతర డిజిటల్ ఆధారాల సంగతేంటి? అనే ప్రశ్నలను అధికారులు అడిగినట్లు సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. గుర్తులేదు, మర్చిపోయానంటూ ఉదయ్ కృష్ణారెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో సూసైడ్ నోట్‌ అంశంపైనా పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. సూసైడ్ నోట్‌ ఎప్పుడు రాశారు? దాని వెనుక కారణమేంటి? దానికి సంబంధించిన డిజిటల్ ఆధారాలు ఎక్కడున్నాయనే అంశాలపై అధికారులు వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అంశంపైనా ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి ఆశించిన స్థాయిలో సమాధానాలు రాలేదని తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే..

ఈ కేసులో సహచర మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో జులై 18న కేసు నమోదైంది. 2023లో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆ తర్వాత తనను తరచూ వేధించడంతో పాటు ఆధిపత్య ధోరణితో వ్యవహరించాడని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించారు. తాను మరో వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కూడా వేధింపులు కొనసాగించాడని, ప్రైవేట్ చాట్స్‌ను లీక్ చేస్తానంటూ బెదిరించాడని ఫిర్యాదులో ప్రస్తావించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి జులై 28న ఉదయ్ కృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు. అయితే కీలక ప్రశ్నలకు ఉదయ్ కృష్ణారెడ్డి నుంచి స్పష్టత రాకపోవడంతో.. అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాలను విశ్లేషించి దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర