AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’ G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యను కొందరు అహంకారపూరితంగా భావించగా, మరికొందరు సరదా వ్యాఖ్యగా తీసుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తన ఉద్దేశం పెత్తనం చెలాయించడం కాదని, కేవలం సరదాగా మాట్లాడానని స్పష్టం చేశారు.

‘‘జస్ట్ జోక్ చేశాను అంతే..’’  G7లో సరదా వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్న డొనాల్డ్ ట్రంప్
Donald Trump
Balaraju Goud
|

Updated on: Jun 20, 2026 | 1:37 PM

Share

ఫ్రాన్స్ వేదికగా జీ7 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన “నేనే బాస్” వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిపై ఆయన వివరణ ఇచ్చారు. ఈ వ్యాఖ్యను కొందరు అహంకారపూరితంగా భావించగా, మరికొందరు సరదా వ్యాఖ్యగా తీసుకున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ తన ఉద్దేశం పెత్తనం చెలాయించడం కాదని, కేవలం సరదాగా మాట్లాడానని స్పష్టం చేశారు.

‘ది ఆక్సియోస్ షో’లో మాట్లాడుతూ ట్రంప్, “నేను కేవలం సరదాగా ఉండటానికి ప్రయత్నించాను. నేను బాస్‌లా ప్రవర్తించాలని అనుకోలేదు. అది ఒక జోక్ మాత్రమే” అని తెలిపారు. జీ7 సమావేశ మందిరంలోకి ప్రవేశించిన సమయంలో ఇతర ప్రపంచ నాయకులు ఇప్పటికే తమ స్థానాల్లో కూర్చుని ఉన్నారని, ఆ దృశ్యాన్ని చూసి సరదాగా “నేనే బాస్” అని అన్నానని చెప్పారు. ఈ వ్యాఖ్య ప్రపంచవ్యాప్తంగా అంత పెద్ద చర్చకు దారితీస్తుందని తాను ఊహించలేదని ట్రంప్ అన్నారు. “వారందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. నేను లోపలికి వెళ్లి ‘నేనే బాస్’ అని చెప్పాను. అది సరదాగా చేసిన వ్యాఖ్య మాత్రమే. కానీ దాని గురించి ప్రపంచమంతా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది” అని పేర్కొన్నారు.

ఈ ఘటన జీ7 సదస్సు చివరి రోజున చోటుచేసుకుంది. ట్రంప్ వ్యాఖ్యలు చేసిన వెంటనే సమావేశ మందిరంలో ఉన్న పలువురు నాయకులు నవ్వినట్లు సమాచారం. ముఖ్యంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆ వ్యాఖ్యను సరదాగా తీసుకుని ట్రంప్‌ను పలకరించారు. అనంతరం ఇద్దరి మధ్య స్నేహపూర్వక సంభాషణ కూడా జరిగింది.

ఇదిలావుంటే, జీ7 సదస్సులో ప్రధానంగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ వాణిజ్యం, ప్రపంచ ఆర్థిక సహకారం వంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి. అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్ దేశాలతో కూడిన జీ7 వేదిక ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమస్యలపై చర్చించే అత్యంత ప్రభావవంతమైన వేదికగా గుర్తింపు పొందింది. అయితే ఈసారి జీ7 సమావేశాల్లో భారతదేశం తరపున ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కాగా, ఈ సమావేశం వేదికగా ట్రంప్ చేసిన ఒక చిన్న వ్యాఖ్యే అంతర్జాతీయ చర్చకు కేంద్రబిందువుగా మారింది.

వీడియో ఇక్కడ చూడండి.. 

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us