AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెడ్ రోడ్‌లో యోగా మహాసంగమం.. ప్రధాని మోదీ నేతృత్వంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం

భారత్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు కోల్‌కతా ముస్తాబైంది. జూన్ 21న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్‌లో జరిగే ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. "యోగా ఫర్ హెల్తీ ఏజింగ్" అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.

రెడ్ రోడ్‌లో యోగా మహాసంగమం.. ప్రధాని మోదీ నేతృత్వంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం
12th International Yoga Day Celebrations In Kolkata
Balaraju Goud
|

Updated on: Jun 20, 2026 | 5:21 PM

Share

భారత్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలకు కోల్‌కతా ముస్తాబైంది. జూన్ 21న పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్‌లో జరిగే ప్రధాన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం వహించనున్నారు. “యోగా ఫర్ హెల్తీ ఏజింగ్” అనే థీమ్‌తో ఈ ఏడాది వేడుకలు నిర్వహిస్తున్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.

జూన్ 21, ఆదివారం ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో వేలాది మంది యోగా సాధకులు ప్రత్యక్షంగా పాల్గొననుండగా, దేశ విదేశాల నుంచి లక్షలాది మంది వర్చువల్‌గా పాల్గొనే అవకాశం ఉంది. కామన్ యోగా ప్రోటోకాల్ ఆధారంగా నిర్వహించే ఈ సామూహిక యోగా కార్యక్రమంలో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని దేశ ప్రజలకు మార్గనిర్దేశనం చేయనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా సంగమ్ పోర్టల్‌కు అపూర్వ స్పందన లభించింది. ఇప్పటికే 6 లక్షలకు పైగా సంస్థలు ఇందులో నమోదు కావడం విశేషం. యోగాను ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా ఇది ఒక కీలక మైలురాయిగా అధికారులు పేర్కొంటున్నారు.

అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవానికి విశేష ఆదరణ లభిస్తోంది. ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సమన్వయంతో ప్రపంచవ్యాప్తంగా 210కి పైగా భారతీయ మిషన్లు, దాదాపు 2,500 ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. దీంతో భారతీయ యోగా సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట, హరిద్వార్, కోణార్క్ సూర్య దేవాలయం, హంపి, మహాబలిపురం, హైదరాబాద్ సహా 100 చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాల్లో యోగా కార్యక్రమాలు జరగనున్నాయి. భారతీయ సంస్కృతి, వారసత్వం, యోగా సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ కార్యక్రమాలను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం, యోగాను కేవలం వ్యాయామంగా కాకుండా జీవనశైలిగా స్వీకరించాలనే సందేశాన్ని మరోసారి బలంగా వినిపించనుంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!