బాన్సువాడ నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన స్పీకర్‌ పోచారం.. మందిరానికి పోచారం రూ.లక్ష విరాళం

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి రామభక్తులు ఆయోధ్యకు సైకిల్‌ యాత్రగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సైకిల్‌ యాత్రను..

బాన్సువాడ నుంచి అయోధ్యకు సైకిల్ యాత్ర.. జెండా ఊపి ప్రారంభించిన స్పీకర్‌ పోచారం.. మందిరానికి పోచారం రూ.లక్ష విరాళం
Speaker Pocharam
Follow us

|

Updated on: Mar 19, 2021 | 1:41 PM

కామారెడ్డి జిల్లా బాన్సువాడ నుంచి రామభక్తులు ఆయోధ్యకు సైకిల్‌ యాత్రగా బయలుదేరారు. ఈ నేపథ్యంలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సైకిల్‌ యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. శ్రీరామ రక్షా మహాపాదయాత్రి వారి ఆధ్వర్యంలో బాన్సువాడ నుంచి శ్రీరామ జన్మభూమి అయోధ్యకు 33 మంది స్వాములు సైకిల్‌ యాత్రగా బయలు దేరారు.

ఈ సందర్భంగా సువర్ణభూమి మహాపాదయాత్ర బృందం తరపున అయోధ్యలో నిర్మించే రామ మందిరానికి ఒక కిలో వెండి ఇటుకను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా శాసనసభా పతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అయోధ్య రామాలయం నిర్మాణానికి రూ.1,01,116 విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సాహసంతో కూడుకున్న సైకిల్‌ యాత్రగా వెళ్లే భక్తులు క్షేమంగా వెళ్లి క్షేమంగా రావాలని కోరుకున్నారు.

భక్తులు శ్రీరాముడి దర్శనం చేసుకుని క్షేమంగా తిరిగొచ్చే శక్తిని బాన్సువాడ భక్తులకు ప్రసాదించాలని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రార్థించారు. సువర్ణభూమి అధినేత శ్రీనివాసరావు అనతి భార్య పిల్లలు కూడా సైకిల్‌ యాత్రలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మహాపాదయాత్ర గురుస్వామి గురు వినయ్‌ కుమార్‌, సువర్ణభూమి అధినేత మేక శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read More:

కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కౌంటింగ్‌.. అక్కడ 34 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌.. రెండో ప్రాధాన్యత ఓట్లపై టెన్షన్‌

మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 4 వరకు జాతీయ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు.. బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

లోటస్‌పాండ్‌లో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరం.. ఖమ్మం సభపై కోఆర్డినేషన్‌ కమిటీ వేసిన షర్మిల