మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు జాతీయ హ్యాండ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు.. బ్రోచర్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రీడా, సాంస్కృతిక రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ..
తెలంగాణ ఏర్పాటు తర్వాత క్రీడా, సాంస్కృతిక రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడా రంగానికి బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయిస్తుందని చెప్పారు.
హైదరాబాద్ లో మార్చ్ 31 నుండి ఏప్రిల్ 4 వ తేది వరకు సరూర్ నగర్ స్టేడియంలో 43 వ జూనియర్ బాలికల జాతీయ హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ జరుగుతాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. ఈ మేరకు బ్రోచర్ ను జాతీయ హ్యాండ్ బాల్ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ జగన్ మోహన్ రావు కలసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన నివాసంలో ఆవిష్కరించారు.
జాతీయ స్థాయి క్రీడా పోటీలకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంగా ఉందన్నారు మంత్రి శ్రీనివాస్‌గౌడ్. క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న క్రీడా మైదానాలను అధునాతన సౌకర్యాలతో తీర్చి దిద్దుతున్నామని చెప్పారు. రాబోవు రోజుల్లో క్రీడా రంగానికి మరింత ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. క్రీడల పట్ల అభిరుచి ఉన్న యువకులు ప్రభుత్వ పథకాలను, వసతులను ఉపయోగించుకుని క్రీడల్లో రాణించాలని మంత్రి కోరారు. సీఎం కేసీఆర్‌కు క్రీడలన్నా, క్రీడాకారులన్నా ఆసక్తి కనబరుస్తారని చెప్పారు. అందుకే గత ప్రభుత్వాలకు భిన్నంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పవన్ కుమార్, హైదరాబాద్ జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు ఉదయ్ కుమార్ రెడ్డి, సీనియర్ కోచ్ రవి, జగన్ మోహన్ గౌడ్, దీపక్, శివ కుమార్, హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read More:
లోటస్‌పాండ్‌లో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరం.. ఖమ్మం సభపై కోఆర్డినేషన్ కమిటీ వేసిన షర్మిల