హస్తినలో ఏపీ మంత్రి మేకపాటి బిజీ బిజీ.. సాయంత్రం కేంద్ర మంత్రి రవిశకంర్‌ ప్రసాద్‌తో భేటీ

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏపీ ఏటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పర్యటన మూడోరోజు బిజీబిజీగా కొనసాగుతోంది..

హస్తినలో ఏపీ మంత్రి మేకపాటి బిజీ బిజీ.. సాయంత్రం కేంద్ర మంత్రి రవిశకంర్‌ ప్రసాద్‌తో భేటీ
Mekapati Goutham Reddy
Follow us
K Sammaiah

|

Updated on: Mar 19, 2021 | 12:53 PM

దేశ రాజధాని న్యూఢిల్లీలో ఏపీ ఏటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పర్యటన మూడోరోజు బిజీబిజీగా కొనసాగుతోంది. ఉదయం 9.00గం.లకు డిఆర్డిఓ అధ్యక్షులు జి .సతీష్ రెడ్డితో ఆయన నివాసంలో మేకపాటి గౌతమ్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఉదయం 11.30గం.లకు కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వదవన్ తో సమావేశమై, ఏపీ పరిశ్రమలకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

ఇక సాయంత్రం 4 గం.లకు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ తో సమావేశం కానున్నారు. సాయంత్రం 5.15గం.లకు సంచార్ భవన్ లో కేంద్ర ఐ.టీ&ఎలక్ట్రానిక్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశం కానున్నారు. ఇందుకు అపాయింట్‌మెంట్‌ కూడా ఖరారైందని మంత్రి కార్యాలయం ప్రకటించింది.

తన హస్తిన పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సమావేశమైన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రైతులకు శుభవార్త అంటూ ప్రకటించారు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి. కర్నూలు నుంచి ‘కిసాన్ ఎక్స్ప్రెస్ రైలు’ తరహాలో రాష్ట్రంలో రైతుల కోసం మరిన్ని కిసాన్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఏర్పాటుకు కేంద్ర మంత్రి సంసిద్ధత వ్యక్తం చేసినట్లు వెల్లడించారు.

కర్నూల్ నుంచి ఇప్పటికే అరటి పండ్ల ఎగుమతులకు కిసాన్ ఎక్స్ప్రెస్ రైలు నడుస్తోంది. అదే తరహాలో మామిడి పండ్లు తదితర ఉద్యానవన కోసం మరిన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను కేటాయిస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించినట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.

మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు లో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం కోరినట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వివరించారు. రాయలసీమలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వినతి పత్రం అందజేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా లోని కొప్పర్తి, కర్నూలులోని ఓర్వకల్ ప్రాంతాలను పారిశ్రామిక కేంద్రాలుగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మానవవనరులు, నైపుణ్యం, పారిశ్రామిక భూ బ్యాంకు సహా మౌలికసదుపాయాలు పుష్కలంగా ఉన్నా ఈ ప్రాంతాలలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్కుల ఏర్పాటుకు సహకరించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.

ఇంటిగ్రేటెడ్ టాయ్ పార్కుల స్థాపనకు సహకారం అందించవలసిందిగా కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. బొమ్మల పరిశ్రమ రంగ అభివృద్ధి పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని వివరించారు. సంప్రదాయ, ఎలక్ట్రానిక్ , ఖరీదైన బొమ్మలను తయారుచేసే ఇంటిగ్రేటెడ్ టాయ్స్ పార్క్ ఏర్పాటు ప్రతిపాదనలను వినతి పత్రంలో ప్రస్తావించారు. టాయ్స్ పార్క్ ఏర్పాటులో కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరారు.

ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చిన ‘వోకల్ ఫర్ లోకల్’ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 13 జిల్లాల నుంచి మూడు రకాల ఉత్పత్తులను గుర్తించినట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ 13 రకాల వస్తువులలో చేనేత, బొమ్మలు, హస్తకళలు, ఖనిజాలు‌, ఆహార ఉత్పత్తులూ ఉన్నాయని వెల్లడించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ను అమలు చేయడంలో ఇప్పటికే కార్యాచరణ, ప్రణాళికలు పూర్తయ్యాయని అందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించవలసిందిగా కేంద్ర మంత్రిని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు.

Read More:

లోటస్‌పాండ్‌లో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరం.. ఖమ్మం సభపై కోఆర్డినేషన్‌ కమిటీ వేసిన షర్మిల

నిన్నటి వరకు దినసరి కూలీలు.. నేడు కార్పొరేషన్లకు మేయర్లు.. ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో సరికొత్త అధ్యాయం

చంద్రబాబు పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. సీఐడీ నోటీసులపై క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేసిన టీడీపీ అధినేత