Telangana MLC Elections: కొనసాగుతోన్న ఎమ్మెల్సీ కౌంటింగ్.. అక్కడ 34 మంది అభ్యర్థుల ఎలిమినేషన్
Telangana MLC Election 2021 Result: తెలంగాణలో పట్టభద్రుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రాధాన్య ఓట్లలో..
తెలంగాణలో పట్టభద్రుల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో మొదటి ప్రాధాన్య ఓట్లలో ఫలితం తేలలేదు. దీంతో రెండో ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. తొలి ప్రాధాన్యం ఓట్లలో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేశారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానంలో 71 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఓట్ల లెక్కింపులో 500 లోపు ఓట్లు వచ్చిన 34 మంది అభ్యర్థులను అధికారులు ఎలిమినేషన్ చేశారు. వారికి వచ్చిన ఓట్లను తొలి ఐదు స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు కలిపారు. ఇందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి 133 ఓట్లు, స్వతంత్య అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు 119 ఓట్లు, ప్రొఫెసర్ కోదండరామ్‌కు 137 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 50 ఓట్లు కలిపారు.
ఇక కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 33 ఓట్లు కలిపారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఇప్పటి వరకు వచ్చిన ఓట్లు 1,10,973 సంఖ్యకు చేరింది. అలాగే తీన్మార్ మల్లన్న ఓట్లు 83,409కి చేరాయి. కోదండరామ్‌కు 70,209 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి విజయానికి 1,83,167 ఓట్లు అవసరం. ఆ మేరకు రెండో ప్రాధాన్యత ఓట్లలో ఫలితం తేలిపోతుందా లేదా మూడో ప్రధాన్యత ఓట్లను కూడా లేక్కించాలా అనేది వేచి చూడాలి.
నల్గొండలో పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో 3,87,969 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 3,66,333 ఓట్లు చెల్లుబాటయ్యాయి. ఏడు రౌండ్లలో 21,636 ఓట్లు చెల్లకుండాపోయాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు తొలి రౌండ్ లెక్కింపు ప్రక్రియ ప్రారంభించగా శుక్రవారం ఉదయానికి ఏడు రౌండ్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయింది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజారిటీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో కూడా ఫలితం తేలకుంటే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది. అలా అయితే తుది ఫలితం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.
Read More:
లోటస్‌పాండ్‌లో కొత్తపార్టీ ఏర్పాట్లు ముమ్మరం.. ఖమ్మం సభపై కోఆర్డినేషన్ కమిటీ వేసిన షర్మిల