Etela : ఇంజక్షన్లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోంది : మంత్రి ఈటల ఆగ్రహం
Etela : కరోనాకి సంబంధించి ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపు లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana Health Minister Etela Rajender : కరోనాకి సంబంధించి ఇంజక్షన్ లు, వాక్సిన్, ఆక్సిజన్ కేటాయింపు లో కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపిస్తోందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ తెలంగాణలో ఆక్సిజన్ కొరత వస్తే కేంద్రానిదే బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రానికి తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నామని ప్రెస్ మీట్ ముఖంగా ఆయన తెలియజేశారు. రాష్ట్రాలతో కేంద్రం సమన్వయంతో ముందుకు పోవడం లేదన్నారు ఈటల. కొన్ని ఆసుపత్రుల వారు శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు వ్యవహరిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. వాక్సిన్ ధరలో తేడాలు పెట్టడం కేంద్ర ప్రభుత్వం సంకుచిత ధోరణికి నిదర్శనమన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా కరోనా భయపెడుతోందన్న ఆయన.. మొదటి ఫేస్ లో కరోనాని విజయవంతంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు. కరోనా సెకండ్ ఫేస్ సందర్భంగా ప్రధాన మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఇతర రాష్ట్రాల సీఎం ల మాట్లాడిన తీరు చూసి మన ముఖ్యమంత్రి కేసీఆర్… ముందుగా జాగ్రత్త పడాలని సూచించారని ఈటల తెలిపారు. పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్, ఏపీ, కర్ణాటక లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సమాయత్తం కావాలని సీఎం ఆదేశించారన్నారు. ఆ ప్రకారమే 4 లక్షల రిమ్ డెసివర్ ఇంజక్షన్ లకు ఆర్డర్ పెట్టామని తెలిపారు. “మన దగ్గరే ఇవి తయారు అవుతున్నాయి కాబట్టి మనకు ఎక్కువ డోసులు వస్తాయి అని ఆశించాము.. కానీ కేంద్రం మొత్తం పంపిణీ వ్యవస్థను తమ కంట్రోల్ లో కి తీసుకొని మనకు మొండి చెయ్యి చూపించింది.” అని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి: టిక్ టాక్ వీడియోలో దెయ్యం.. గమనించని అమ్మాయి.. చివరికి అలా.. వీడియో వైరల్..
మన జీవన విధానాలను మార్చుకోవాలని ఈ కరోనా మనకు సూచిస్తోంది.. నాగార్జున హీరోయిన్..