జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు.. కుంభ సందేశ్ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ

భారతదేశ సంస్కృతీ, సాంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ..

  • K Sammaiah
  • Publish Date - 12:21 pm, Fri, 19 February 21
జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు.. కుంభ సందేశ్ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్సీ

భారతదేశ సంస్కృతీ, సాంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గ్రామోదయ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ టెక్నాలజీ వారు నిర్వహిస్తున్న ‘కుంభ సందేశ్ యాత్ర ” ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల ‌కవిత హైదరాబాద్ లో జెండా ఊపి ప్రారంభించారు.

అంతకుముందు జుబ్లీహిల్స్ పెద్దమ్మ గుడిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, కరోనా మహమ్మారి లాంటి క్లిష్టమైన సమయంలోనూ ప్రపంచమంతా, భారత సాంప్రదాయాలు పాటించిందని గుర్తు చేశారు.

భారత దేశ సంస్కృతీ, సంప్రదాయాలను కొత్త తరానికి చేరవేయడంతో పాటు, ప్రపంచవ్యాప్తం చేసేందుకు కుంభ సందేశ్ యాత్రను నిర్వహిస్తున్న వసంత్ ను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. కన్యాకుమారి నుంచి హరిద్వార్ వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Read more:

అజ్మీర్‌ దర్గాకు చాదర్‌ సమర్పించిన సీఎం కేసీఆర్‌.. ముస్లింలకు శుభాకాంక్షలకు తెలిపిన ముఖ్యమంత్రి