AP to Centre: APCC చీఫ్ శైలజానాథ్‌ భీకర శపథం.. విజయసాయిపై వదిలిన ఒక్క తూటాతో సరికొత్త రాజకీయ చెడుగుడు

రాహుల్‌ గాంధీ దేశ ప్రధాని అయిన గంటలోనే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తారని.. ఒకవేళ రాకుంటే, ఇదే గడ్డ మీద తాను ఆత్మార్పణకు చేసుకుంటానని APCC చీఫ్ శైలజానాథ్..

AP to Centre: APCC చీఫ్ శైలజానాథ్‌ భీకర శపథం.. విజయసాయిపై వదిలిన ఒక్క తూటాతో సరికొత్త రాజకీయ చెడుగుడు
Follow us

|

Updated on: Feb 19, 2021 | 12:12 PM

రాహుల్‌ గాంధీ దేశ ప్రధాని అయిన గంటలోనే ఏపీకి ప్రత్యేక హోదా తీసుకువస్తారని.. ఒకవేళ రాకుంటే, ఇదే గడ్డ మీద తాను ఆత్మార్పణకు చేసుకుంటానని APCC చీఫ్ శైలజానాథ్‌ చేసిన తీక్షణ శపథం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలాన్ని రేపింది. ప్రస్తుత పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్‌కు ఉన్న బలమెంత, కేడర్‌ ఎంత, పీఎం పోస్ట్‌ ఎలా సాధిస్తారు..? ఇలాంటి విషయాలన్నీ పక్కనపెడితే, శైలజానాథ్‌ చేసిన ఒక్క కామెంట్‌తో ఏపీ కాంగ్రెస్‌ ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టన్‌గా మారిపోయింది.

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు నినాదంతో కార్మికుల ఆందోళన సాగుతోన్న వేళ, ఇప్పుడు శైలజనాథ్‌ వదిలిన ఆత్మార్పణ శపథంతో విశాఖ మేటర్‌ ఇప్పుడు ఢిల్లీ వరకు చేరింది. కట్ చేస్తే, స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం సభ ఏర్పాటైంది. ఈ సభలో కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. స్టేజ్‌మీద ప్రసంగిస్తోన్న శైలజనాథ్‌.. ఎంపీ విజయసాయి విశాఖ వీధుల్లో పాదయాత్రలు చేస్తే ప్రయోజనం లేదని, ఢిల్లీ వెళ్లి ప్రధాని స్పందించేలా ఏదైనా చేయాలనడంతో నిప్పు అంటుకుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసం యాత్రలు చేస్తున్నారంటూ శైలజనాథ్‌ గట్టి కామెంట్ వదిలారు.

ఇలాఉంటే, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఏపీలో కేడర్ ఒక్కసారిగా మాయమైపోగా, పలు రాష్ట్రాల్లో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు క్లైమాక్స్‌ కార్డు పడేందుకు ముహూర్తం ఫిక్సైందని ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. ఇలాంటి టైంలో, ఏపీ చీఫ్ శైలజానాథ్ వ్యాఖ్యలు రాహుల్ గాంధీకి ఎలాంటి తలనొప్పులు తెస్తాయోనన్నది సీనియర్ల భావన.