గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన ఎమ్మెల్సీ

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన పుట్టిన రోజును పురస్కరించుకుని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు..

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో పాల్గొన్న కల్వకుంట్ల కవిత.. తన పుట్టిన రోజున మొక్కలు నాటిన ఎమ్మెల్సీ
Mlc Kavitha Green India Cha
Follow us

|

Updated on: Mar 13, 2021 | 1:43 PM

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన పుట్టిన రోజును పురస్కరించుకుని మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపుమేరకు ప్రగతి భవన్ లో స్వయంగా గుంతలు తీసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభమ్మ, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ఈ పుట్టినరోజు రోజు ఎప్పటికీ మర్చిపోలేనిది అన్నారు. అమ్మ , అన్నయ్య సంతోష్ తో కలిసి మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని కవిత తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తు పచ్చదనం పెంచడం కోసం కృషి చేస్తున్న సంతోష్‌కుమార్‌ను అభినందించారు.

తన పుట్టిన రోజున మొక్కలు నాటించడం తనకిచ్చిన మంచి బహుమతిగా అభివర్ణించారు కవిత. ఇది ఎప్పటికీ మరిచిపొలేని మధుర జ్ఞాపకం గా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.

జాగృతి కార్యాలయంలో ఘనంగా వేడుకలు

తెలంగాణ జాగృతి ప్ర‌ధాన కార్యాల‌యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్రత్యేక గీతాన్ని మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా 30 మంది పేద విద్యార్థినులకు లేడి బర్డ్ సైకిళ్లు, ఆరుగురు దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటీలను పంపిణీ చేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మ‌హ‌ముద్ అలీ మాట్లాడుతూ.. బ‌తుక‌మ్మ పండగ‌ను విశ్వ‌వ్యాప్తం చేయ‌డంలో క‌విత కృషి ఎన‌లేనిది అని చెప్పారు. తెలంగాణ సంస్కృతీ సాంప్ర‌దాయాలపై క‌విత అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారని గుర్తు చేశారు. ఈ వేడుక‌ల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, సాట్స్ ఛైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు దేవీ ప్రసాద్, మర్రి రాజశేఖర్ రెడ్డి, తలసాని సాయి కిరణ్ యాదవ్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్  పాల్గొన్నారు.

Read More:

నేడు ఎమ్మెల్సీ కవిత జన్మదినోత్సవం.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లోనూ ఘనంగా వేడుకలు

శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల‌కు శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ‌.. వాహనసేవల వివరాలు ఇవే..

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..