TRS vs TPCC : పిల్లి కూత‌ల‌కు భ‌య‌ప‌డే వారెవ‌రూ లేరు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతల మాటల తూటాలు..

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాటల యుద్ధం మొదలు పెట్టారు. తాజాగా TRS ఎల్పీలో సుధీర్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శలు గుప్పించారు.

TRS vs TPCC : పిల్లి కూత‌ల‌కు భ‌య‌ప‌డే వారెవ‌రూ లేరు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతల మాటల తూటాలు..
Trs Mla Sudheer Reddy
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 05, 2021 | 5:42 PM

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాటల యుద్ధం మొదలు పెట్టారు. తాజాగా TRS ఎల్పీలో సుధీర్ రెడ్డితోపాటు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శలు గుప్పించారు. పిల్లి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే వారెవ‌రూ ఇక్కడ లేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. TRS ఎల్పీలో సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… త‌మ కార్య‌క‌ర్త‌ల‌ను రేవంత్ హింస వైపు ప్రేరేపిస్తున్నారని… రాష్ట్రంలో అల్ల‌క‌ల్లోలం సృష్టించేందుకు రేవంత్ రెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పిల్లి కూత‌ల‌కు, బెదిరింపుల‌కు భ‌య‌ప‌డే వాళ్లు ఎవ‌రూ లేరు అని స్ప‌ష్టం చేశారు. సంస్కారం అడ్డు రావ‌డంతో.. రేవంత్ ఉప‌యోగించిన భాష‌ను వాడ‌లేక‌పోతున్నామ‌న్నారు.

నిరంత‌రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటూ, వారి బాగోగులు చూసుకుంటూ సేవా రాజ‌కీయాలు చేస్తున్నామ‌ని తెలిపారు. ఎంపీగా గెలిచిన త‌ర్వాత మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌రోజైనా ప‌ర్య‌టించావా? క‌రోనా బారిన ప‌డిన ప్ర‌జ‌ల‌ను ఎనాడైనా చేర‌దీశావా? అంటూ ప్రశ్నించారు. క‌రోనాకు భ‌య‌ప‌డి ఇంట్లో దాక్కున్న వ్య‌క్తి రేవంత్ రెడ్డి అని ధ్వ‌జ‌మెత్తారు. సేవా చేయాల్సింది పోయి.. రెచ్చ‌గొట్టే రాజ‌కీయాలు చేస్తున్నారని మండి పడ్డారు.

రేవంత్ రెడ్డి ఇప్ప‌టికైనా ప్రజల కోసం పోరాడితే మంచిదని హితవు పలికారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన‌ప్పుడు రేవంత్ రెడ్డి స్పీక‌ర్‌కు ఎందుకు రాజీనామా లేఖ ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డి నోరు జారి, దిగ‌జారుడు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేద‌ని సుధీర్ రెడ్డి హెచ్చ‌రించారు.

ఇక ఇదే సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. రాజకీయంలో వాతావరణం కలుషితం చేసి హింస వైపు తీసుకెళ్తారని ఆందోళన వ్యక్తం చేశారు. హీరోయిజం బ్లాక్ మెయిలింగ్‌లో కాదు ప్రజా సేవలో చూపించాలన్నారు. నాలుగు పార్టీలు తిరిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి మమ్ములను విమర్శించే హక్కు లేదన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకోని నేత రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం సమయంలో చంద్రబాబు పక్కన ఉన్న తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ మండిపడ్డారు. పీసీసీ కమిటీలో నిజమైన కాంగ్రెస్ కనిపించడం లేదని… రేవంత్ రెడ్డి డబ్బులు పెట్టి పీసీసీ కమిటీ వేయించుకున్నారంటూ చిరుమర్తి లింగయ్య విమర్శించారు.

ఇవి కూడా చదండి : Congress politics: కాంగ్రెస్‌లో ముదురుతున్న ముసలం.. మాజీ సీఎం ప్రకటనకు తాజాగా పీసీసీ చీఫ్ కౌంటర్..

Krishna Water: కృష్ణా జలాల వివాదంపై దాఖలైన పిటీషన్.. రేపటికి వాయిదా వేసిన హైకోర్టు