AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Water: కృష్ణా జలాల వివాదంపై దాఖలైన పిటీషన్.. రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

కృష్ణా జలలాల వివాదంపై ఏపీ రైతులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణను మంగళవారంకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. హై కోర్టు వేసిన జస్టిస్ రామ్ చందర్ రావు బెంచ్ ముందు..

Krishna Water: కృష్ణా జలాల వివాదంపై దాఖలైన పిటీషన్.. రేపటికి వాయిదా వేసిన హైకోర్టు
Krishna Water Issue On Tela
Sanjay Kasula
|

Updated on: Jul 05, 2021 | 4:07 PM

Share

Krishna Water Issue: కృష్ణా జలలాల వివాదంపై ఏపీ రైతులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణను మంగళవారంకు వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. హై కోర్టు వేసిన జస్టిస్ రామ్ చందర్ రావు బెంచ్ ముందు ఇవాళ వాదనలు ప్రారంభమయ్యాయి. జస్టిస్ రామ్‌చందర్‌రావు బెంచ్ ముందు వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. కృష్ణా జలాల పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని తెలంగాణ అడ్వకేట్ జనరల్ ప్రతిపాదించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ రామ్‌చందర్‌రావు బెంచ్ విచారించాలన్నారు. పిటిషన్‌ను విచారించేందుకు రేఫ్యుజ్ చేయాలని ఛీప్ జస్టిస్‌ను ఏజీ కోరారు. ఈ విషయంపై ఎందుకు విచారించవద్దో చెప్పాలని జస్టిస్ రామ్‌చందర్‌రావును తెలంగాణ అడ్వకేట్ జనరల్ ప్రశ్నించారు.

.కృష్ణా జలాలపై ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమ వాటా కింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమ‌ని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. జల విద్యుదుత్పత్తిని ఆపేదీ లేదని.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు చేప‌డుతోందని పేర్కొంటోంది. ఈ ఏడాది జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 34 జీవోను రద్దు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టులో కృష్ణా జిల్లా రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ తెలంగాణ నీరు తొడుకుంటుందంటూ తెలంగాణ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతులు పిటీషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు తెలంగాణ హైకోర్టులో హౌస్ మోష‌న్ పిటిష‌న్ దాఖలు చేశాడు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాల‌ను ఉల్లంఘిస్తోంద‌ని ఆయ‌న పిటిషన్‌లో వెల్లడించారు.

తెలంగాణ విద్యుత్‌ ప్రాజెక్టులు నూటికి నూరుశాతం పనిచేయాలంటూ.. గ‌త నెల 28న తెలంగాణ స‌ర్కారు జారీ చేసిన జీవోను స‌స్పెండ్ చేయాల‌ని ఆయ‌న కోరారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరిట నీటిని విడుదల చేయడం వ‌ల్ల ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర న‌ష్టం క‌లుగుతుంద‌ని ఆయ‌న పిటిషన్‌లో వెల్లడించారు. కాగా.. రాయలసీమ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ పంపిన నాటి నుంచి కృష్ణా జలాలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. దీనిపై నివేదిక సమర్పించాలని కేంద్రం కృష్ణా బోర్డును ఆదేశించింది. కాగా ఈ విషయంపై ఇప్పటికే ఇరు రాష్ట్రాల నాయకులు కృష్ణా జలాలపై తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ప్రస్తుత ఈ విషయం కాస్తా ఇరు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదండి : Congress politics: కాంగ్రెస్‌లో ముదురుతున్న ముసలం.. మాజీ సీఎం ప్రకటనకు తాజాగా పీసీసీ చీఫ్ కౌంటర్..

CBSE Exams: సీబీఎస్‌ఈ 12 పరీక్షలు రాయానులకునే వారికి ముఖ్య గమనిక.. పరీక్షల నిర్వహణ ఎప్పటి నుంచంటే..