AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSWREIS: తెలంగాణ గురుకులాల్లో టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.

TSWREIS Recruitment 2021: తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా.. వ‌రంగ‌ల రూర‌ల్ అశోక్ న‌గ‌ర్‌, క‌రీంన‌గ‌ర్‌లోని రుక్మాపూర్‌లో ఉన్న తెలంగాణ...

TSWREIS: తెలంగాణ గురుకులాల్లో టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది.
Tswreis
Narender Vaitla
|

Updated on: Jul 05, 2021 | 3:12 PM

Share

TSWREIS Recruitment 2021: తెలంగాణ సోష‌ల్ వెల్ఫేర్ రెసిడెన్షియ‌ల్ ఎడ్యుకేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూష‌న్స్ సొసైటీ గురుకులంలో ఫ్యాకల్టీ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఇందులో భాగంగా.. వ‌రంగ‌ల రూర‌ల్ అశోక్ న‌గ‌ర్‌, క‌రీంన‌గ‌ర్‌లోని రుక్మాపూర్‌లో ఉన్న తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ప్రిపరేటరీ డిగ్రీ కాలేజ్‌ ఫర్‌ మెన్, ఉమెన్ (టీడబ్ల్యూఆర్‌ఏఎఫ్‌పీడీసీ)లో ఫ్యాక‌ల్టీ పోస్టులను భ‌ర్తీ చేయున్నారు. దరఖాస్తుల స్వీకరణ నేటితో (05-07-2021) ముగియ నుంది. ఈ నేపథ్యంలో ఖాళీల చేయనున్న పోస్టులు, అర్హతలు లాంటి పూర్తి వివరాల మీకోసం..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హత‌లు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 46 పోస్టుల‌ను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. * తెలుగు, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్, ఫిజికల్‌ సైన్సెస్, సోషల్‌ సైన్సెస్, హిందీ స‌బ్జెక్టుల్లో పీజీటీ, టీజీటీ, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. * టీజీటీ పోస్టుల‌కు సంబంధించి సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. అంతేకాకుండా సీటెట్‌/టెట్‌ అర్హత సాధించి ఉండాలి. * ఆర్ట్‌ టీచర్‌ పోస్టులకి ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. * కంప్యూటర్‌ టీచర్‌ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఎంసీఏ/బీటెక్‌ (కంప్యూటర్స్‌) ఉత్తీర్ణులవ్వాలి. * కౌన్సిల‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు సైకాలజీలో ఎంఏ ఉత్తీర్ణులవ్వాలి. * పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టుల్లో పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ ఉత్తీర్ణులవ్వాలి. సీటెట్‌/టెట్‌ అర్హత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విష‌యాలు..

* టీజీటీ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు రూ. 30,000, పీజీటీ అభ్యర్థులకు నెలకు రూ.40,000, ఆర్ట్, కంప్యూటర్, కౌన్సిలర్‌ పోస్టులకు నెలకు రూ.20,000 జీతంగా చెల్లిస్తారు. * అభ్యర్థుల‌ను రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. * అర్హత‌, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ నేటితో (సోమవారం) ముగియనుంది. * పూర్తి వివ‌రాల కోసం ఈ వెబ్‌సైట్‌ల‌ను చూడండి. https://tswreis.in/, https://tgtwgurukulam.telangana.gov.in/

Also Read: CBSE Exams: సీబీఎస్‌ఈ 12 పరీక్షలు రాయానులకునే వారికి ముఖ్య గమనిక.. పరీక్షల నిర్వహణ ఎప్పటి నుంచంటే..

ICICI: పొంచి ఉన్న స్విమ్‌ స్వాపింగ్‌ ప్రమాదం.. ఖాతాదారులను అలర్ట్‌ చేసిన ఐసీఐసీఐ. స్విమ్‌ స్వాపింగ్‌ అంటే ఏంటనేగా?

Festivals In Week: ఈ వారంలో ఉన్న పండుగలు ఏంటో తెలుసా.. ఆషాడం అమావాస్య ఎప్పుడంటే..