JC comment : జేసీ కొత్త యాంగిల్ : వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని దారుణంగా తిడుతుంటే.. ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా?

రాజశేఖర్ రెడ్డి తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అంటూ ఫుల్ టర్న్ తీసుకున్నారు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి..

JC comment :  జేసీ కొత్త యాంగిల్ : వైఎస్‌ రాజశేఖర్ రెడ్డిని దారుణంగా తిడుతుంటే..  ఏపీ మంత్రులు గాజులు తొడుక్కున్నారా?
Jc Prabhakar Reddy
Follow us
Venkata Narayana

|

Updated on: Jul 05, 2021 | 4:30 PM

JC Prabhakar Reddy on YSR : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి తనకు ఇష్టమైన నాయకుడు, ఆప్తుడు అంటూ ఫుల్ టర్న్ తీసుకున్నారు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి. వైఎస్ తెలంగాణకు ద్రోహం చేశాడు… నరరూప రాక్షసుడు అంటూ తెలంగాణ మంత్రులు వ్యాఖ్యలు చేయడం సరికాదన్న జేసీ, వాళ్లు అంతేసి మాటలంటుంటే ఏపీ మంత్రులు గాజులు తొడుక్కొని కూర్చున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని పార్టీలతో సంబంధం లేకుండా కోట్లాది మంది ఇష్టపడతారని, తనకూ ఆయనంటే చాలా ఇష్టమన్నారు. అలాంటి మహానేతను తెలంగాణ ద్రోహి అని, నరరూప రాక్షసుడంటూ తెలంగాణ మంత్రులు విమర్శించడం బాధాకరమన్నారు. వైఎస్సార్ లాంటి పెద్ద మనిషిని రాక్షసుడు అనడానికి నోరెలా వచ్చిందని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ని ఎవరైనా ఒక్కమాటంటే బూతులతో రెచ్చిపోయే మంత్రులు.. తెలంగాణ నాయకులు వైఎస్సార్‌ను నోటికొచ్చినట్లు తిడుతుంటే ఎందుకు స్పందించడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి నిలదీశారు.

వైఎస్ పేరుతో ఎన్నికల్లో గెలిచిన నేతలు ఆయన్ని తిడుతుంటే మాత్రం నీతుకు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో ఏపీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అందరూ హ్యాపీగా జీవిస్తున్నారని జేసీ అన్నారు. హైదరాబాదులో సెటిలర్స్ ఎవరని నిలదీశారు. తమ పిల్లలు హైదరాబాద్‌లోనే పుట్టారని.. అక్కడే చదువుకున్నారని.. ఇక్కడ ప్రజలు హైదరాబాద్‌కి వెళ్లి షాపింగ్ చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో చెప్పుకొచ్చారు.

Read also : CM Jagan review : కొవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం.. కీలక నిర్ణయాలు