కారు తరపున ప్రచారం చేస్తూ సైకిల్‌కి ఓటేయాలని అభ్యర్థన!

చాలా కాలం పాటు ఒకే పార్టీలో కొనసాగి ఇప్పుడు పార్టీ మారిన నేతలు అంత త్వరగా పద్ధతి మార్చుకోవడం కుదరదు. పాత పార్టీ నినాదాలు నరనరాన జీర్ణించుకుపోవడంతో కొత్తపార్టీలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన ఖమ్మం టీడీపీ నేత నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరపున అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన ప్రచారం చేస్తూ ‘సైకిల్ గుర్తుకే మన ఓటు’ అంటూ నినాదాలు చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు షాకయ్యారు. వెంటనే […]

  • Tv9 Telugu
  • Publish Date - 2:38 pm, Tue, 9 April 19
కారు తరపున ప్రచారం చేస్తూ సైకిల్‌కి ఓటేయాలని అభ్యర్థన!

చాలా కాలం పాటు ఒకే పార్టీలో కొనసాగి ఇప్పుడు పార్టీ మారిన నేతలు అంత త్వరగా పద్ధతి మార్చుకోవడం కుదరదు. పాత పార్టీ నినాదాలు నరనరాన జీర్ణించుకుపోవడంతో కొత్తపార్టీలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇటీవల టీఆర్ఎస్‌లో చేరిన ఖమ్మం టీడీపీ నేత నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ తరపున అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన ప్రచారం చేస్తూ ‘సైకిల్ గుర్తుకే మన ఓటు’ అంటూ నినాదాలు చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు షాకయ్యారు. వెంటనే ఆయన తేరుకుని మళ్లీ కారు గుర్తుకే మన ఓటు అని సరిదిద్దుకున్నారు.

తాజాగా మరో గులాబీ నేత కుడా సైకిల్ గుర్తుకే ఓటు అని కోరుతూ షాకిచ్చారు. సత్తుపల్లి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిసిన సండ్ర వెంకట వీరయ్య ఇటీవలే టీఆర్ఎస్‌లో చేరారు. సోమవారం రాత్రి నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కల్లూరు రోడ్‌షోలో పాల్గొన్న సండ్ర సైకిల్ గుర్తుకే ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. వెంటనే సర్దుకుని కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు.