నోరు జారిన గౌరు చరితా.. ‘జై జగన్’ అన్న టీడీపీ అభ్యర్థి
ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన కర్నూల్ నేత గౌరు చరితా రెడ్డి ఎన్నికల ప్రచారంలో నోరు జారారు. పాణ్యం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా తనను, లోక్‌సభ సభ్యుడిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని గెలిపించాలని కోరిన చరితా.. చివరగా ‘జై జగన్’ అంటూ నినాదం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో అక్కడున్న కొందరు మాత్రం కేకలు వేశారు. అయితే తన మాటలకు వెంటనే తేరుకున్న చరితా […]

ఇటీవల వైసీపీని వీడి టీడీపీలో చేరిన కర్నూల్ నేత గౌరు చరితా రెడ్డి ఎన్నికల ప్రచారంలో నోరు జారారు. పాణ్యం ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యేగా తనను, లోక్‌సభ సభ్యుడిగా కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డిని గెలిపించాలని కోరిన చరితా.. చివరగా ‘జై జగన్’ అంటూ నినాదం ఇచ్చారు. దీంతో అక్కడ ఉన్న టీడీపీ నేతలు, కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. అదే సమయంలో అక్కడున్న కొందరు మాత్రం కేకలు వేశారు. అయితే తన మాటలకు వెంటనే తేరుకున్న చరితా రెడ్డి నవ్వుతూ.. ‘జై చంద్రబాబు, జై తెలుగుదేశం’ అంటూ నినాదాలు ఇచ్చి ముందుకు కదిలారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
https://twitter.com/Vote_For_Fan/status/1115486511699333120