టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య జాబ్స్‌ ఫైట్‌.. గన్‌పార్క్‌ దగ్గర కుర్చీ వేసుకుని కాంగ్రెస్‌ వెయిటింగ్‌..

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు..

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య జాబ్స్‌ ఫైట్‌.. గన్‌పార్క్‌ దగ్గర కుర్చీ వేసుకుని కాంగ్రెస్‌ వెయిటింగ్‌..
Follow us
K Sammaiah

|

Updated on: Feb 26, 2021 | 1:49 PM

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చేతులెత్తేసిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా ఆరేళ్లలో లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశాని అధికార పార్టీ లెక్కలు చెబుతుంది ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి శ్రవణ్‌, బీజేపీ ఎమ్మెల్సీ రామ్‌చందర్‌రావు మధ్య ఉద్యోగాల భర్తీ అంశంపై సవాళ్లు విసురుకున్నారు.

లక్షా 32 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్సీ రామ్ చందర్ రావు. కేటీఆర్ తో లైవ్ చర్చకు సిద్ధమన్నారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ముందు చర్చిద్దాం దమ్ముంటే రా…అని సవాల్ విసిరారు. వస్తే తాను ఎమ్మెల్సీగా ఏం చేశానో చెబుతానన్నారు. అడ్వకెట్ లకు వంద కోట్లు ఫండ్ రావడానికి తానే కారణమన్నారు. హై కోర్ట్ విభజన చేయించింది తామేనన్నారు. కరోనా టైమ్ లో పీపీఈ కిట్స్ ఇచ్చింది తామేనని..కేటీఆర్ వి అన్నీ అబద్ధాలేనన్నారు.

ఉద్యోగాల భర్తీపై చర్చకు సిద్దమన్న కేటీఆర్ సవాల్ ను స్వీకరించారు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్.. 26న మధ్యాహ్నం 12 గంటలకు గన్ పార్క్ దగ్గర చర్చకు రెడీ అన్నారు శ్రవణ్. విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులకు ప్రమోషన్ ఇచ్చి కూడా భర్తీ చేసినట్లు చూపించారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో 24 వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారన్న కేటీఆర్ కామెంట్స్ పై మండిపడ్డారు దాసోజు శ్రవణ్ .

అయితే చర్చకు వచ్చేదెవరు? జాబ్స్‌ ఫైట్‌లో నిలబడేదెవరు? గన్‌పార్క్‌ దగ్గర లెక్కలు చెప్పేదెవరు? అన్న మాట ప్రకారమే గన్‌పార్క్‌ దగ్గరకు వచ్చారు కాంగ్రెస్‌ నేతలు. KTR కోసం పేరు రాసి మరీ ఓ కుర్చీ వేశారు. యూత్‌ కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు… పెద్దయెత్తున అక్కడకు చేరుకున్నారు. లక్షా 32 వేల 799 ఉద్యోగాలు ఇచ్చామన్న కేటీఆర్‌ సవాల్‌పై చర్చకు సిద్ధమయ్యారు కాంగ్రెస్‌ నేతలు. మరి దీనికి టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరైనా వస్తారా? రారా? అన్నది ఆసక్తి మారింది. నిన్ననే బహిరంగ లేఖ కూడా రాశారు కేటీఆర్‌. ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలు ఇవ్వకపోతే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్యే వివేక్‌ ప్రతి సవాల్‌ కూడా చేశారు.

ఈ నేపథ్యంలో చర్చకు సిద్ధమన్న కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరించి… గన్‌పార్క్‌కు వచ్చారు దాసోజు శ్రవణ్‌. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల వేళ… జాబ్స్‌పై ఈ పొలిటికల్‌ ఫైట్‌ టెన్షన్‌ క్రియేట్‌ చేస్తోంది. గన్‌పార్క్‌ వద్ద ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కేటీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. టీఆరెస్ పార్టీకి సిగ్గు, శరం లేదని… కేటీఆర్ వ్యవహార శైలి చూస్తే నవ్వొస్తుందంటూ మండిపడ్డారు. ఉద్యోగాలను కల్పించామని అబద్దం చెబుతున్నారని… ప్రగతి భవన్ లో కూర్చొని డ్రామాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. మీ కోసమేనా యువత బలిదానాలు చేసుకున్నదని… నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కవిత ఓడిపోతే.. ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చే వరకు నిద్రపోలేదని.. లక్ష 32 వేల ఉద్యోగాలు.. ఇచ్చాం అని ఎట్ల చెబుతారని నిలదీశారు. అవినీతి సొమ్ముతో.. ఓట్లు కొనడానికి సిద్ధంగా వున్నారా… కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని వదిలి పెట్టబోదని హెచ్చరించారు.

మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ అంశం రాజకీయాల్లో కాక రేపుతుంది. తాజా పరిణామాలను తెలంగాణ ఉద్యమకారులతో పాటు ఇటు నిరుద్యోగులు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Read more:

స్పీడందుకున్న సెక్రటేరియట్ నిర్మాణ పనులు.. ఆకస్మికంగా తనిఖీలు చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి