తారాస్థాయికి చేరుతున్న ఉద్యోగుల విభేదాలు.. రెవెన్యూ అసోసియేషన్‌లో VRO సంఘం కలుస్తుందనే ప్రచారంతో రచ్చ

విఆర్వో పదోన్నతులు ఇప్పించడం కంటే ఆ క్రెడిట్ సొంతం చేసుకోవాలని బొప్పరాజు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావ్..

తారాస్థాయికి చేరుతున్న ఉద్యోగుల విభేదాలు.. రెవెన్యూ అసోసియేషన్‌లో VRO సంఘం కలుస్తుందనే ప్రచారంతో రచ్చ
Follow us
K Sammaiah

|

Updated on: Feb 26, 2021 | 1:04 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ సంఘాల నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కుతున్నాయి. రెవెన్యూ అసోసియేషన్‌లో VRO సంఘం మళ్లీ కలుస్తుందనే ప్రచారం కొత్త రచ్చకు దారితీస్తోంది. VROల ప్రమోషన్ల దగ్గర మొదలైన వివాదం ఇప్పుడు సంఘాల నేతల మధ్య విభేదాలకు దారితీస్తోంది.

విఆర్వో పదోన్నతులు ఇప్పించడం కంటే ఆ క్రెడిట్ సొంతం చేసుకోవాలని బొప్పరాజు ప్రయత్నిస్తున్నారు. ఏపీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఆస్కార్ రావ్ ఆరోపించారు. బొప్పరాజు తమను అన్యాయం చేశారని రెవిన్యూ ఉద్యోగులు అయిన విఆర్వోలు మా సంఘం వద్దకు వచ్చారు. విఆర్వోలు సీనియర్ అసిస్టెంట్ లు అయ్యాక రెవిన్యూ ఉద్యోగులు అవుతారని బొప్పరాజు అంటున్నారు. మాతో కలిసినప్పడే జివో నెంబర్ 132 వచ్చిందని. నిన్న బొప్పరాజుతో కలిసిన నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.

విఆర్ఏ లకు విఆర్వోలు గా, విఆర్వోలు సీనియర్ అసిస్టెంట్ లు ప్రమోషన్ లను ఇప్పించే పనిలో మేం ఉన్నాం. విఆర్వోలు ఎక్కువ మంది జూనియర్ అసిస్టెంట్ లు తక్కువ మంది ‌వున్నారు. 60 విఆర్వోలకు 40 జూనియర్ అసిస్టెంట్ కు సీనియర్ అసిస్టెంట్ ప్రమోషన్ లను ఇవ్వాలని మేం కోరుతున్నాం. నాది రెవిన్యూ శాఖ‌ మాకు ఒక్కరికే రెవిన్యూ శాఖ ఉద్యోగుల బాధ్యత నాదే అని బొప్పరాజు మాట్లాడటం సరికాదు. మా అధ్యక్షులు సూర్యనారాయణ పై బొప్పరాజు ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆస్కార్‌రావు అన్నారు.

మా అధ్యక్షుడు సూర్యనారాయణ ఉద్యోగుల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు. బొప్పరాజు వర్గీయులను బెదిరించాల్సిన అవసరం మా సంఘానికి లేదు. ఏసిబి దాడులు‌చేయిస్తామని సూర్యనారాయణ ఎవరినీ బెదిరించలేదు. ఏసిబి కేసు ల్లో ఇరుక్కున్న ఉద్యోగుల కోసం పోరాటం చేస్తోంది సూర్యనారాయణ అని ఆస్కార్‌రావు తెలిపారు.

Read more:

స్పీడందుకున్న సెక్రటేరియట్ నిర్మాణ పనులు.. ఆకస్మికంగా తనిఖీలు చేసిన మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి