AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గులాబీలో గెలుపు ధీమా..అయినా వదలని “ఆ” టెన్షన్

హుజూర్‌నగర్ బై పోల్‌ ముగిసింది. గులాబీకి కొత్త టెన్షన్‌ పట్టుకుంది. ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌ చేరాయి. కానీ ఎక్కడో ఒక డౌట్‌. ఆ గుర్తు కొంప ముంచుతుందా? మెజార్టీ తగ్గిస్తుందా? లేక అసలుకే ఎసరు తేస్తుందా? అని గులాబీ నేతలు తెగ భయపడుతున్నారు. ఇంతకీ గులాబీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్న ఆ సింబల్‌ ఏంటి? హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. కానీ గులాబీ నేతలకు ఓ టెన్షన్ పట్టుకుంది. రోడ్డు రోలర్‌ ఈ పేరు వింటేనే […]

గులాబీలో గెలుపు ధీమా..అయినా వదలని ఆ టెన్షన్
Rajesh Sharma
| Edited By: |

Updated on: Oct 22, 2019 | 8:10 PM

Share

హుజూర్‌నగర్ బై పోల్‌ ముగిసింది. గులాబీకి కొత్త టెన్షన్‌ పట్టుకుంది. ఈవీఎంలు స్ట్రాంగ్‌ రూమ్‌ చేరాయి. కానీ ఎక్కడో ఒక డౌట్‌. ఆ గుర్తు కొంప ముంచుతుందా? మెజార్టీ తగ్గిస్తుందా? లేక అసలుకే ఎసరు తేస్తుందా? అని గులాబీ నేతలు తెగ భయపడుతున్నారు. ఇంతకీ గులాబీ నేతలకు నిద్రలేకుండా చేస్తున్న ఆ సింబల్‌ ఏంటి?

హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. కానీ గులాబీ నేతలకు ఓ టెన్షన్ పట్టుకుంది. రోడ్డు రోలర్‌ ఈ పేరు వింటేనే టీఆర్‌ఎస్‌ నేతలు ఇప్పుడు ఆందోళనకు గురువుతున్నారు. రెండు రోజుల్లో ఫలితం కూడా రాబోతుంది. సర్వేలన్నీ టీఆర్‌ఎస్‌దే గెలుపు అని చెబుతున్నాయి. కానీ ఒకే ఒక అంశం టీఆర్‌ఎస్‌ కలవరపెడుతోంది. దాదాపు పదివేలకు పైగా మెజార్టీతోనే గెలుస్తామని గులాబీ నేతలు ఆశలు పెట్టుకున్నారు. కానీ రోడ్డు రోలర్‌ గుర్తు ఏం చేస్తుందో అనే దడ ఇప్పుడు టీఆర్‌ఎస్‌ నేతల్లో కనపడుతోంది.

2014 ఎన్నికల్లో ట్రక్కు గుర్తు గులాబీకి 30 నుంచి 35 సీట్లలో ప్రభావం చూపింది. తక్కువ మార్జిన్‌తో గెలవాల్సిన సీట్లు కోల్పోయింది. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో రోడ్డు రోలర్‌ సింబల్‌ ఎఫెక్ట్‌ చాలానే పడింది. భువనగిరి పార్లమెంట్‌ ఎన్నికల్లో రోడ్‌ రోలర్‌ దెబ్బకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ ఓడిపోయారు. ఇక్కడ రోడ్‌ రోలర్‌కు 27వేల 973 ఓట్లు వచ్చాయి. ఈ ఓట్ల తేడాతోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విజయం సాధించారు.

ఇప్పుడు హుజూర్‌నగర్‌లో ఈవీఎంలో ప్రధాన పార్టీల అభ్యర్థులకు మొదట ఐదు ప్లేస్‌లు కేటాయించారు. ఐదో ప్లేస్‌లో కారు గుర్తు ఉంది. దాని వెంటనే రైతు నడిపే ట్రాక్టర్‌ గుర్తు…ఆ తర్వాత రోడ్డు రోలర్‌ గుర్తు ఉన్నాయి. మూడు గుర్తులు చూసేందుకు ఒకేలా ఉన్నాయి. దీంతో ఇప్పుడు వృద్ధులు,మహిళలు, కొంత సైట్‌ ఉన్న వారు కారు అనుకుని పొరపాటున రోడ్డురోలర్‌కు వేసే అవకాశం ఉంది. పోల్‌ పోస్టుమార్టంలో కూడా కొందరు అటు వేశారని తేలడంతో……గులాబీ నేతలు టెన్షన్‌లో పడ్డారు. రోడ్డు రోలర్‌ ఏంత మేరకు డ్యామేజీ చేసిందనే లెక్కలు సేకరించే పనిలో పడ్డారు.

రిపబ్లిక్ సేన పార్టీకి చెందిన కిరణ్ వంగపల్లి లి రోడ్ రోలర్ గుర్తు వచ్చింది. ఈయనకు ఎన్ని ఓట్లు పడతాయని అటు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు పొలిటికల్‌ లెక్కలు వేస్తున్నారు. మరోవైపు రైతు బిడ్డ పార్టీ అజ్మీరా మహేష్ కు ట్రాక్టర్ నడిపే రైతు, ఇండిపెండెంట్ క్యాండేట్‌ లింగిడి వెంకటేష్ కు హెలికాప్టర్ గుర్తుకు ఎన్ని ఓట్లు పడ్డాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.