AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిధుల కోసం ఉమ్మడిపోరు.. సీఎంల కొత్త వ్యూహం

రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చెరోదారిలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణలో అధికారపార్టీ టిఆర్ఎస్ నేతలు ఓ అడుగు ముందుకేసి పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేసి ప్రధాని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు, ఎంపీలు ఇప్పటి దాకా కేవలం అభ్యర్థనలకే పరిమితమయ్యారు. కానీ తాజాగా ఇద్దరు సీఎంలు ఉమ్మడి పోరుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి మొత్తం 30 వేల కోట్ల […]

నిధుల కోసం ఉమ్మడిపోరు.. సీఎంల కొత్త వ్యూహం
Rajesh Sharma
| Edited By: Nikhil|

Updated on: Dec 12, 2019 | 3:34 PM

Share

రెండు తెలుగు రాష్ట్రాలు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చెరోదారిలో ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణలో అధికారపార్టీ టిఆర్ఎస్ నేతలు ఓ అడుగు ముందుకేసి పార్లమెంటు భవనం ఎదుట ధర్నా చేసి ప్రధాని దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. వైసీపీ నేతలు, ఎంపీలు ఇప్పటి దాకా కేవలం అభ్యర్థనలకే పరిమితమయ్యారు. కానీ తాజాగా ఇద్దరు సీఎంలు ఉమ్మడి పోరుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి మొత్తం 30 వేల కోట్ల రూపాయలు రావాల్సి వుందని కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. 29 వేల 891 కోట్లు పెండింగ్‌లో వున్నాయంటూ టిఆర్ఎస్ నేతలు పార్లమెంటు భవనం ముందు ధర్నా చేశారు. జీఎస్టీ వాటా నిధులను విడుదల చేయడంలో జాప్యమెందుకని వారు ప్రశ్నించారు. మరోవైపు పోలవరంప్రాజెక్టు నిర్మాణం, సహాయ పునరావాస పథకాల అమలు కోసం 16 వేల కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను కోరుతోంది. దాంతో పాటు రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన ఆర్థికలోటును ఇంత వరకు భర్తీ చేయకపోవడంపైనా కేంద్రంతో వైసీపీ ఎంపీలు చర్చలు జరుపుతున్నారు. పార్లమెంటులో ప్రస్తావించడం, మంత్రుల చుట్టూ తిరగడమే వైసీపీ ఎంపీలు పనిగా పెట్టుకున్నారు.

అయితే డిసెంబర్ తొలివారంలో ఇద్దరు సీఎంలు కేసీఆర్, జగన్ వేర్వేరుగా ఢిల్లీకి వెళ్ళారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసేందుకు యత్నించారు. కానీ కారణాలేమైనా మోదీతో వారిద్దరి భేటీ క్యాన్సిల్ అయ్యింది. దాంతో ఇద్దరు సీఎంలు ప్రధాన మంత్రిని కల్వకుండానే తిరుగు ప్రయాణంమయ్యారు. తాజాగా.. టిఆర్ఎస్ పార్టీ పోరాట పంథాను ఎంచుకుంది. పార్లమెంటు ఎదుట ధర్నా నిర్వహించింది. జాతీయ మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేశారు టిఆర్ఎస్ ఎంపీలు. ఈ నేపథ్యంలో బిజెపిలో కాస్త కదలిక వచ్చిన దరిమిలా వైసీపీ కూడా అదే పంథాను ఎంచుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.

ఈనేపథ్యంలోనే కేసీఆర్, జగన్‌లిద్దరు మరోసారి భేటీ అవ్వాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే వీరిద్దరి భేటీ వుంటుందని, కేంద్రంపై పోరాడే వ్యూహంపై సీఎంలిద్దరు చర్చిస్తారని రెండు పార్టీల నేతల్లో చర్చ జరుగుతోంది. వైసీపీ, టిఆర్ఎస్ కలిసి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే పని అవుతుందన్న అభిప్రాయంలో ఇరు పార్టీల నేతలున్నట్లు సమాచారం.

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!