AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిఆర్ఎస్-బిజెపిల మధ్య నిధుల చిచ్చు

తెలంగాణలో రెండు ప్రధాన పార్టీల మధ్య నిధుల చిచ్చు రగులుకొంది. కేంద్రం నుంచి దాదాపు 30 వేల కోట్లు నిధులు తెలంగాణకు రావాల్సి వుందని తెలంగాణ రాష్ట్ర సమితి అంటుంటే టిఆర్ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపీలు ఎదురు దాడి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ సహా పలు రకాల కేంద్ర నిధులు పెండింగ్‌లో వున్నాయని ఆరోపిస్తూ బుధవారం పార్లమెంటు భవనం ఎదుట టిఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేశారు. మొత్తం 29 వేల […]

టిఆర్ఎస్-బిజెపిల మధ్య నిధుల చిచ్చు
Rajesh Sharma
|

Updated on: Dec 12, 2019 | 2:19 PM

Share

తెలంగాణలో రెండు ప్రధాన పార్టీల మధ్య నిధుల చిచ్చు రగులుకొంది. కేంద్రం నుంచి దాదాపు 30 వేల కోట్లు నిధులు తెలంగాణకు రావాల్సి వుందని తెలంగాణ రాష్ట్ర సమితి అంటుంటే టిఆర్ఎస్ నేతలు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని బిజెపి ఎంపీలు ఎదురు దాడి చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ సహా పలు రకాల కేంద్ర నిధులు పెండింగ్‌లో వున్నాయని ఆరోపిస్తూ బుధవారం పార్లమెంటు భవనం ఎదుట టిఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేశారు. మొత్తం 29 వేల 891 కోట్ల రూపాయలు వివిధ పద్దుల కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఇవ్వాల్సి వుందని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిధుల విడుదలలో జాప్యం చేస్తుందని టిఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. పది రోజుల క్రితం ఇదే అంశంపై ప్రధాని మోదీని కల్వడానికి ఢిల్లీ వెళ్ళిన తెలంగాణ సీఎం కెసీఆర్, ఆ తర్వాత అత్యవసర పనితో మోదీని కల్వకుండానే తిరిగి వచ్చేశారు.

ఆ తర్వాత తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో పోరాడాల్సిందిగా టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో కెసీఆర్, కెటీఆర్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే బుధవారం టిఆర్‌పార్టీకి చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పార్లమెంటు భవనం ఎదుట బుధవారం ధర్నా చేశారు.

టిఆర్ఎస్ ఎంపీల ధర్నాపై బిజెపి ఎంపీలు స్సందించారు. గులాబీ ఎంపీలు పార్లమెంటు ఎదుట డ్రామాలు చేశారంటూ బిజెపి ఎంపీలు ముగ్గురు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. గత ఆరేళ్ళుగా కేంద్ర మిచ్చిన నిధులను కెసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని, తద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారని వారు ఆరోపించారు. బడ్జెట్ నిర్వహణలో భారీ అవకతవకలు, పెద్ద ఎత్తున అవినీతి, ఆర్థిక క్రమశిక్షణ ఏమాత్రం లేకపోవడం వంటి విధానాలతో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కెసీఆర్ గందరగోళంలోకి నెట్టారని బిజెపి ఎంపీలు అంటున్నారు.

మొత్తమ్మీద కేంద్రం నిధులు టిఆర్ఎస్, బిజెపి పార్టీల మధ్య మాటల యుద్దానికి తెరలేపాయి. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల సంబంధాలు మరింత బలహీనపడ్డాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Follow Us
హీరో లేకుండానే వంద రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
హీరో లేకుండానే వంద రోజులు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఇంట్లో ఉండే మందార పువ్వే కదా అని తక్కువ అంచనా వేయకండి.. లాభాలు
ఇంట్లో ఉండే మందార పువ్వే కదా అని తక్కువ అంచనా వేయకండి.. లాభాలు
చదివింది పదో తరగతే.. డీఎస్పీ అవతారమెత్తి రూ.26 లక్షలు వసూలు!..
చదివింది పదో తరగతే.. డీఎస్పీ అవతారమెత్తి రూ.26 లక్షలు వసూలు!..
ఇంటర్నెట్​ యుద్ధంలో నెగ్గేది ఎవరు?
ఇంటర్నెట్​ యుద్ధంలో నెగ్గేది ఎవరు?
నరసింహ సినిమాలో సౌందర్య రూల్.. అందుకే నో చెప్పా..
నరసింహ సినిమాలో సౌందర్య రూల్.. అందుకే నో చెప్పా..
తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో..
తనతోనే ఉండాలంటూ వెంటపడ్డాడు.. మహిళ ఒప్పుకోకపోవడంతో..
20 ఏళ్ల రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చేయెచ్చు.. రూ.12 లక్షలు ఆదా..!
20 ఏళ్ల రుణాన్ని 15 ఏళ్లలోనే తీర్చేయెచ్చు.. రూ.12 లక్షలు ఆదా..!
ట్రిగ్గర్ రిజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే మతిపోతుంది
ట్రిగ్గర్ రిజ్ టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ధర తెలిస్తే మతిపోతుంది
జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఇలా
జుట్టుకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఇలా
పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతాను అన్నాడు.. ఆయనే కాపాడారు.
పెళ్లి చేసుకోకపోతే విషం తాగి చచ్చిపోతాను అన్నాడు.. ఆయనే కాపాడారు.