CM KCR: దద్దమ్మలా మాట్లాడుతున్నారన్నారు.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కామెంట్స్‌కు సీఎం కేసీఆర్ కౌంటర్..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ కిషన్‌రెడ్డి కామెంట్ చేయగా.. ఓ రేంజ్‌లో కౌంటరిచ్చారు ముఖ్యమంత్రి.
CM KCR on Kishan Reddy: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్. రైతుల జీవితాలతో చెలగాటం ఆడొద్దంటూ కిషన్‌రెడ్డి కామెంట్ చేయగా.. ఓ రేంజ్‌లో కౌంటరిచ్చారు ముఖ్యమంత్రి. తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మండిపడ్డారు. తెలంగాణలో వచ్చేది బాయిల్డ్ రైసేనని.. బాయిల్ చేయకుంటే వచ్చేది 50శాతమేనన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అన్నింటికీ ఎదురొడ్డి రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లామన్నారు. రైతుల అభ్యున్నతికి అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్నారు. వాటర్ సెస్ లేకుండా నీళ్లిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ఇదంతా చూసి బీజేపీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. నిర్వహణ సామర్థ్యం లేని బీజేపీ మాపై నిందలు వేస్తోందని విరుచుకుపడ్డారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉండి కూడా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కిషన్‌రెడ్డికి దమ్ముంటే కేంద్రంతో ధాన్యాన్ని కొనిపించాలి.. తెలంగాణ వాతావరణం బాయిల్డ్ రైసుకే అనుకూలం అని కేంద్రం వద్ద వాదన వినిపించాలని సీఎం కేసీఆర్ సవాల్ విసిరారు. ఈ ఉల్టా పల్టా మాట్లాడి మేం బియ్యం కొనమన్నమా? అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతున్నాడని.. ఒక రాష్ట్రానికి కేంద్ర మంత్రి ఉంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడుతరని.. ఇలాంటి మంత్రి కాదన్నారు. “యాసంగిలో మాకు బాయిల్డ్ రైసే వస్తది తీసుకోవాలని చెబితే సిపాయి కిషన్‌రెడ్డి. ఎట్లా అయినా నేను కొనిపిస్తే అంటే సిపాయి కిషన్‌రెడ్డి. కొనమని చెప్పే కేంద్రమంత్రి కావాలన్న తెలంగాణకు అంటూ ప్రశ్నించారు. చాతకాని దద్దమ్మ అంటూ విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నడు అని విమర్శించారు.
ఇవి కూడా చదవండి: Leptin and Obesity: మీలో ఈ హార్మోన్లు పనిచేయకపోతే డయాబెటిస్ వచ్చినట్లే.. అవేం చేస్తాయో తెలుసా..
Kishan Reddy: ఆయన మొండి వైఖరి వల్లే రైతులకు తీవ్ర నష్టం.. సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి..