స్వతంత్ర అభ్యర్థిగా సుమలత
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నటి సుమలత, మాజీ కాంగ్రెస్ నాయకుడు దివంగత అంబరీష్ భార్య సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె అధికారిక ప్రకటన ఇచ్చారు. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. అయితే జేడీఎస్- కాంగ్రెస్ కూటమిలో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడీఎస్ అభ్యర్థికి కేటాయించారు. ఈ నియోజకవర్గం నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి […]
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నటి సుమలత, మాజీ కాంగ్రెస్ నాయకుడు దివంగత అంబరీష్ భార్య సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆమె అధికారిక ప్రకటన ఇచ్చారు. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేయనున్నారు. అయితే జేడీఎస్- కాంగ్రెస్ కూటమిలో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడీఎస్ అభ్యర్థికి కేటాయించారు. ఈ నియోజకవర్గం నుంచి సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి పోటీ చేయనున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి తనకు టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని సుమలత నిర్ణయించుకున్నారు.