మరీ ఇంత పొగరా..! ఆ హీరోయిన్ పుణ్యమా అని నా సీన్స్ లేపేశారు..!! మమతా మోహన్ దాస్ చెప్పింది ఆమె గురించేనా..
ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు కనుమరుగైన భామల్లో మమతా మోహన్ దాస్ ఒకరు. యమదొంగ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు మమతా. ఆతర్వాత పలు సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. కేవలం యాక్టర్ గానే కాకుండా సింగర్ గానూ తన ప్రతిభ చాటుకున్నారు మమతా మోహన్ దాస్.

చాలా మంది హీరోయిన్స్ ఒకానొక సమయంలో రాణించి ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. కొందరు సహాయక పాత్రలు చేస్తూ రీ ఎంట్రీలు ఇస్తున్నా.. కొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇండస్ట్రీలో కొందరు భామలు మల్టీ టాలెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొందరు సింగర్ గా, హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సింగర్ గా, నటిగా నటించింది ఈ అమ్మడు. ఈ బ్యూటీ క్యాన్సర్ భారిన పడిన విషయం తెలిసిందే. ఎంతో దైర్యంతో ఆ మహమ్మారితో పోరాడి కాన్సర్ ను జయించింది మమతా..
అన్నం బదులు అందం తింటుందా..!! సీరియల్‌లో సైడ్ యాక్టర్.. కానీ సినిమా హీరోయిన్లు కూడా పనికిరారు..
ఇదిలా ఉంటేగతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ నయనతార పై మమతా మోహన్ దాస్ పరోక్షంగా షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ రజిని కాంత్ నటించిన ఓ సినిమాలో తనకు ఛాన్స్ దక్కిందని తెలిపారు మమతా మోహన్ దాస్. ఆ సినిమాలోని ఒక పాట కోసం షూటింగ్ కూడా చేశారట. దాదాపు నాలుగు రోజుల పాటు తన పై సాంగ్ ను షూట్ చేశారట.
గోడకేసి కొట్టి, కటింగ్ ప్లేయర్‌తో మంగళసూత్రం తెంచాడు.. సింగర్ కౌసల్య జీవితంలో ఇంత విషాదమా..
అయితే షూట్ చేస్తున్న సమయంలోనే ఆ ఫ్రెమ్ లో నేను లేను అని అర్ధమైంది. కేవలం ఒకే ఒక్క షాట్ లో వెనకనుంచి కనిపించా అని అన్నారు. నాకు చెప్పిన విధంగా సాంగ్ షూట్ జరగలేదని ఆమె అన్నారు. ఎవరైతే ఆ సినిమాలో హీరోయిన్ గా నటించారో ఆమె వల్ల ఈ విధంగా జరిగిందని మమత తెలిపారు. వేరే హీరోయిన్ షూటింగ్ లో ఉంటే నేను రాను అని హీరోయిన్ చెప్పడంతో ఇలా జరిగిందని అన్నారు. అయితే మమతా చెప్పిన రజినీకాంత్ సినిమా కథానాయకుడు సినిమా గురించి అని తెలుస్తుంది. ఆ సినిమా హీరోయిన్ గా చేసింది నయనతార కావడం విశేషం. మమతా ఇలా హీరోయిన్ పేరు చెప్పకుండా నయన్ పై కామెంట్స్ చేసింది.
చూడటానికి పెద్ద అంకుల్.. కానీ నాతో అలా చేశాడు.. షాకింగ్ విషయం చెప్పిన యాంకర్
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




