టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సడన్గా కనిపించకుండా పోవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ప్రొఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ అనే సందేశంతో పాటు పోస్టులు కనిపించకపోవడంతో ఫ్యాన్స్ గందరగోళానికి గురయ్యారు. అనుష్క శర్మ పోస్టుల కింద తమ ఆందోళన వ్యక్తం చేశారు. కొద్దిసేపటికే ఖాతా తిరిగి యాక్టివేట్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.