ఎంత మంది హీరోయిన్స్ వచ్చినా ఈ బ్యూటీ క్రేజ్ తగ్గడం లేదు..

Rajitha Chanti

Pic credit - Instagram

30 January 2026

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. మొదటి చిత్రంతోనే సీతమహాలక్ష్మీ పాత్రతో మెప్పించింది. 

ఈ మూవీ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరో హిట్టు ఖాతాలో వేసుకుంది. నటిగా మెప్పించినా ఈ బ్యూటీకి అంతగా ఆఫర్స్ రాలేదు.

ముజ్సే కుచ్ కెహ్తీ  యే ఖామోషియా అనే సీరియల్ ద్వారా నటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్ గా సత్తా చాటుతుంది.

కుంకుమ భాగ్య సీరియల్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు కథానాయికగా దూసుకుపోతుంది.

జర్నలిజం చేసిన ఈ అమ్మడు నెమ్మదిగా మోడలింగ్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత హిందీలో వరుస సినిమాల్లో నటించి మెప్పించింది.

జెర్సీ సినిమాతో ఈ బ్యూటీకి హిందీలో ప్రశంసలు వచ్చాయి. ప్రస్తుతం తెలుగులో అడివి శేష్ సరసన డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. 

మరోవైపు ధనుష్ తో ప్రేమ, పెళ్లి అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రచారంపై మృణాల్ ఇంతవరకు అధికారికంగా రియాక్ట్ కాలేదు.

అలాగే ఇండస్ట్రీలో ఈ అమ్మడు పేరు మారుమోగుతుంది. అటు సోషల్ మీడియాలో వరుస పోస్టులతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ.