20 ఏళ్లుగా తోపు హీరోయిన్.. 44 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్..
Rajitha Chanti
Pic credit - Instagram
30 January 2026
రెండు దశాబ్దాలకు పైగా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా రాణిస్తుంది హీరోయిన్ శ్రియా శరణ్. ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతుంది.
పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న శ్రియా.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషిస్తూ సహాయ నటిగా రాణిస్తుంది. 2001లో ఇష్టం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది శ్రియ.
ఆ తర్వాత తమిళం, తెలుగు భాషలలో టాప్ హీరోలతో నటించి స్టార్ డమ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది.
మరోవైపు సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. 44 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తగ్గని అందంతో కట్టిపడేస్తుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది. అలాగే యాడ్స్, ప్రమోషన్స ద్వారా సంపాదిస్తుంది.
నివేదికల ప్రకారం ఆమె ఆస్తుల విలువ దాదాపు రూ.80 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. ఆమె భర్త ఆండ్రే కోశ్చివ్ రష్యన్ టెన్నిస్ ప్లేయర్.
ఈ దంపతులకు రాధ అనే కుమార్తె ఉంది. ప్రస్తుతం తెలుగు, హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్