చాణక్య నీతి : చాలా తక్కువ మాట్లాడే వారే శక్తి వంతులు.. ఎందుకంటే?
Samatha
30 January 2026
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం ద్వారా నేటి సమాజానికి ఉపయోగపడే ఎన్నో గొప్ప గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది.
ఆచార్య చాణక్యుడు
అదే విధంగా చాణక్యుడు తక్కువ మాట్లాడే వ్యక్తుల గురించి కూడా తెలియజేశాడు. ఆయన ఎవరు అయితే తక్కువ మాట్లాడతారో, వారే గొప్ప వారు అవుతారని తెలియజేశాడు.
చాణక్యనీతి
కొంత మంది చాలా నిశ్శబ్దంగా ఉంటారు. దీంతో కొంత మంది వారిని ఏది మాట్లాడరు, సైలెంట్ అంటూ అనేక రకాలుగా నిందిస్తారు, కానీ వారే శక్తివంతమైన వారంట.
నిశ్శబ్ధం
ఆ చార్య చాణక్యుడు తక్కువ మాట్లాడే వ్యక్తులు లోతైన ఆలోచన కలిగి ఉంటారు. అలాంటి వారు మాటల ద్వారా కాకుండా చర్యల ద్వారా ప్రభావం చూపుతారంట.
లోతైన ఆలోచనలు
అంతే కాకుండా వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా గొప్పగా ఉంటాయంట. కాగా, ఇప్పుడు మనం తక్కువ మాట్లాడే వారిని చాణక్యుడు శక్తి వంతులు ఎందుకు అంటున్నారో చూద్దాం.
గొప్ప నిర్ణయాలు
చాణక్యుడి ప్రకారం, ఎప్పుడూ మాట్లాడటం గొప్ప కాదు, సరైన పదాలు పలుకుతూ, మాట్లాడాలి, మనం మాట్లాడిన మాటలే మన ఆత్మగౌరవంపై ప్రభావం చూపుతాయి. తక్కువ మాట్లాడేవారు, చాలా శక్తివంతంగా మాట్లాడుతారు.
పదాల్లో గొప్పతనం
తక్కువ మాట్లాడే వారికి ఆలోచించే శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వారు ఎప్పుడూ కూడా తొందర పాటు నిర్ణయాలు తీసుకోరంట.
ఆలోచించే శక్తి ఎక్కువ
అంతే కాకుండా తక్కువ మాట్లాడే వారు తమ రహస్యాలు ఇతరులకు తెలియనివ్వరు, తన మనస్తత్వం అర్థం చేసుకోవడం కూడా కష్టం, ఇది వారి భవిష్యత్తుకు మంచిది.