T20 World Cup 2026 : ఆసీస్‌కు షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి ప్యాట్ కమిన్స్ అవుట్
T20 World Cup 2026 : మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన ఫైనల్ జాబితాలో కమిన్స్ పేరు లేకపోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

T20 World Cup 2026 : మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 సమరానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, మాజీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ మెగా ఈవెంట్ కోసం ఆస్ట్రేలియా ప్రకటించిన ఫైనల్ జాబితాలో కమిన్స్ పేరు లేకపోవడం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంతకాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్న కమిన్స్, టోర్నీ సమయానికి కోలుకుంటాడని భావించినా.. వైద్య పరీక్షల అనంతరం అతను ఆడే పరిస్థితి లేదని తేలిపోయింది.
ప్యాట్ కమిన్స్ లేకపోవడం ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగాన్ని బలహీనపరిచింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో, కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో కమిన్స్ దిట్ట. అయితే అతని వెన్నునొప్పి తీవ్రత తగ్గకపోవడంతో సెలెక్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు. కమిన్స్‌తో పాటు మరో స్టార్ ప్లేయర్ మాథ్యూ షార్ట్‌కు కూడా తుది 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కలేదు. ఫిట్‌నెస్ సమస్యలు, జట్టు బ్యాలెన్సింగును దృష్టిలో ఉంచుకుని సెలెక్టర్లు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.
కమిన్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ బెన్ డ్వార్షుయిస్‌ను జట్టులోకి తీసుకున్నారు. డ్వార్షుయిస్ కేవలం బౌలింగ్ లోనే కాకుండా, ఫీల్డింగ్ లోనూ చురుగ్గా ఉంటాడు. అవసరమైతే చివర్లో బ్యాట్ ఝుళిపించి కొన్ని కీలక పరుగులు జోడించగలడు. ఇక మాథ్యూ షార్ట్ స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ మాట్ రెన్షాను ఎంపిక చేశారు. అన్ని ఫార్మాట్లలో రాణిస్తున్న రెన్షా, జట్టు మధ్యస్థాయి బ్యాటింగ్‌కు మరింత బలాన్నిస్తాడని ఆసీస్ సెలెక్టర్ టోనీ డోడెమైడ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
బెన్ డ్వార్షుయిస్ ఇప్పటివరకు ఆస్ట్రేలియా తరపున 13 టీ20 మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. 2025 నవంబర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను చివరిసారిగా కనిపించాడు. మరోవైపు మాట్ రెన్షాకు టీ20ల్లో అనుభవం తక్కువ. ఇతను కేవలం ఒక్క అంతర్జాతీయ టీ20 మాత్రమే ఆడాడు. ఈ ఏడాది జనవరి 29న పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌తోనే అతను అరంగేట్రం చేశాడు. అనుభవం తక్కువైనా సరే, సాంకేతికంగా బలమైన ఆటగాడు కావడంతో అతనికి మెగా టోర్నీలో చోటు దక్కింది.
వరల్డ్ కప్ 2026 కోసం ఆస్ట్రేలియా తుది జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, జోష్ హేజిల్‌వుడ్, మాథ్యూ కున్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
