ఎన్నికల కోడ్ అమలుతో యూపీలో భారీగా డబ్బు, లిక్కర్ పట్టివేత‌

ఉత్తర్‍ప్రదేశ్‍లో పోలీసులు, ఎక్సైజ్, ఇన్‍కమ్‍ట్యాక్స్ అధికారులుముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ నాలుగు కోట్ల రూపాయల‌ డబ్బు, మూడు లక్షల పదహారు వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు వేల ఆరు వందల‌ కిలోల పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. మూడు లక్షల ముప్పది రెండు వేల వాల్ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించినట్టు ఎన్నికల కమీషన్ తెలిపింది. ఉత్తర్‍ప్రదేశ్‍లో ఏడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 11న […]

ఎన్నికల కోడ్ అమలుతో యూపీలో భారీగా డబ్బు, లిక్కర్ పట్టివేత‌
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 18, 2019 | 4:46 PM

ఉత్తర్‍ప్రదేశ్‍లో పోలీసులు, ఎక్సైజ్, ఇన్‍కమ్‍ట్యాక్స్ అధికారులుముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ నాలుగు కోట్ల రూపాయల‌ డబ్బు, మూడు లక్షల పదహారు వేల లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. రెండు వేల ఆరు వందల‌ కిలోల పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. మూడు లక్షల ముప్పది రెండు వేల వాల్ పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించినట్టు ఎన్నికల కమీషన్ తెలిపింది. ఉత్తర్‍ప్రదేశ్‍లో ఏడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. ఏప్రిల్ 11న మొదటి విడత ఎన్నిక జరుగుతుంది.