AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jana Nayagan: ఆ కారణంగానే జన నాయగన్ ఇబ్బందుల్లో పడ్డాడా?

Jana Nayagan: ఆ కారణంగానే జన నాయగన్ ఇబ్బందుల్లో పడ్డాడా?

Phani CH
|

Updated on: Jan 31, 2026 | 1:52 PM

Share

సంక్రాంతి ముందు నుంచి జననాయగన్ సినిమా, సెన్సార్ బోర్డు మధ్య వివాదం కొనసాగుతోంది. మత విద్వేషాలు, విదేశీ కుట్రలను చిత్రీకరించిన సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. భద్రతా దళాలకు సంబంధించిన సీన్లు కూడా సమస్యగా మారాయి. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఈ వివాదం మరింత జటిలమైంది. రివైజింగ్ కమిటీ పంపినప్పటికీ, విడుదల ఆలస్యం కావడంతో చిత్ర బృందానికి, సినీ ప్రియులకు నిరాశ కలిగింది.

సంక్రాంతి ముందు నుంచి సెన్సార్‌ బోర్డ్.. జననాయగన్ టీం మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. అసలింతకీ.. జననాయగన్ సినిమాలోని ఏ సీన్లతో.. సెన్సార్ బోర్డ్‌ మెంబర్స్‌కు సమస్య అనే క్యూరియాసిటీ కూడా ఫిల్మ్ లవర్స్ అందరిలో నెలకొంది. ఈక్రమంలోనే ఆ సన్నివేశాలేంటనేది మద్రాసు హైకోర్టు వాదనల కారణంగా బయటికి వచ్చాయి. జన నాయగన్‌ చిత్రంలో మత విభేదాలకు ఆస్కారం కలిగించే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని, కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసినట్లుగా చిత్రీకరించిన సన్నివేశాలను అంగీకరించబోమని సెన్సార్‌ బోర్డు సభ్యులు కోర్టుకు తెలిపారు. అందుకే 9 మంది సభ్యుల రివైజింగ్‌ కమిటీకి పంపాలని నిర్ణయించారు. భద్రతా దళాలకు సంబంధించిన చాలా సీన్లు ఉండడం ఒక కారణమైతే.. మొదట ఈ సినిమాను చూసిన కమిటీలో నిపుణులు లేకపోవడం మరో సమస్యకు దారి తీసింది. దీంతో మరోసారి రివైజింగ్‌కు పంపేందుకు సెన్సార్‌ నిర్ణయం తీసుకుంది. రివైజింగ్‌ కమిటీ తర్వాత సెన్సార్‌ వస్తుందని ప్రకటించారు. కానీ, ఇక్కడే ఆలస్యం జరిగింది. చిత్ర నిర్మాతలకు సరైన తేదీ వారు చెప్పకపోవడంతో సినిమా ఎప్పుడు విడుదల కానుందో ఎవరికీ సరైన క్లారిటీ రాలేదు. సెన్సార్‌ బోర్డు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఉండగానే చిత్ర నిర్మాతలు ఎలాంటి వివరణ ఇవ్వకుండా సెన్సార్‌ సర్టిఫికెట్‌ను కోరడం సముచితం కాదని మద్రాస్‌ కోర్టు సూచించడం కొన్న రోజుల క్రితం సెన్సేషనల్ అయింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Om Shanti Shanti Shantihi: ఓం శాంతి శాంతి శాంతిః.. భార్యాభర్తల కామెడీ డ్రామా హిట్టా..? ఫట్టా..?

Jr NTR : నా పేరు వాడేటప్పుడు జాగ్రత్త! హెచ్చరించిన NTR

Varanasi: నేషనల్ లెవల్ లో ట్రెండ్ అవుతున్న వారణాసి

Krithi Shetty: సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న కృతి శెట్టి

కోలీవుడ్ లో స్టార్ వారసుల సందడి