Rahul Gandhi: విపక్ష నేతలపై నిఘా పెట్టారా.. లేదా.. కేంద్రాన్ని ప్రశ్నించిన రాహుల్..
పెగాసస్ నిఘాపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తమ ఆరోపణలకు బలం చేకూర్చాయన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ. విపక్ష నేతలపై నిఘా పెట్టారా ? లేదా ? అన్న విషయంపై..
Pegasus Spyware Case:పెగాసస్ నిఘాపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు తమ ఆరోపణలకు బలం చేకూర్చాయన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ. విపక్ష నేతలపై నిఘా పెట్టారా ? లేదా ? అన్న విషయంపై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పెగాసస్ నిఘాపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించారు రాహుల్‌గాంధీ. పెగాసస్ నిఘా భారత ప్రజాస్వామ్యంపై దాడి అని వ్యాఖ్యానించారు. అసలు పెగాసస్ స్పైవేర్‌ను భారత్‌కు ఎవరు తీసుకొచ్చారని ప్రశ్నించారు రాహుల్. దీనిపై కేంద్రాన్ని తాము మూడు ప్రశ్నలు అడిగినట్టు తెలిపారు. దేశం కటే ప్రధాని పదవి గొప్ప కాదన్నారు. ప్రధాని మోదీ పెగాసస్ వ్యవహారంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
విపక్ష నేతలపై నిఘా పెట్టి ఆ సమాచారాన్ని ప్రధాని మోడీకి , హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఇచ్చారా ? అని ప్రశ్నించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చకు పట్టుబడుతామన్నారు రాహుల్. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పెగాసస్ నిఘాపై తమ ఆరోపణలకు బలం చేకూర్చాయన్నారు రాహుల్‌గాంధీ. పెగాసస్ నిఘా వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.
స్పైవేర్‌తో ఫోన్ల హ్యాకింగ్‌పై సుప్రీం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పెగాసస్ నిఘాపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీని నియమించింది. మాజీ సుప్రీంకోర్టు జడ్జి రవీంద్రన్ నేతృత్వంలో కమిటీ ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తుంది. నిపుణుల కమిటీ పనితీరును తామే పర్యవేక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వ్యక్తుల గోప్యతను కాపాడడం తమ కర్తవ్యమని , పెగాసస్ వ్యవహారంలో కేంద్రం తన వైఖరిని సరిగ్గా వెల్లడించడం లేదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెగాసస్ నిఘాపై విచారణను సుప్రీంకోర్టు 8 వారాల పాటు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
తప్పనిసరి పరిస్థితుల దృష్ట్యా ఈ కమిటీని ఏర్పాటు చేయాల్సి వచ్చిందని తెలిపింది. దేశ పౌరులపై వివక్షాపూరితమైన నిఘాను తాము ఎన్నటికీ అనుమతించబోమని కోర్టు వెల్లడించింది. నేటికాలంలో టెక్నాలజీ చాలా ముఖ్యమని , కాని ఈ టెక్నాలజీ వ్యక్తుల గోప్యతను హరించడానికి ఉపయోగించడం మంచిదికాదని సుప్రీం వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి: LPG Gas Prices: దీపావళి ముందే గ్యాస్ బండకు రెక్కలు.. రూ.100 వరకు పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు..
Covid Lockdown: థర్డ్ వేవ్ భయాలు.. దేశంలోని ఆ నగరంలో మళ్లీ లాక్‌డౌన్..