Chiru Join in Janasena: జనసేనలోకి మెగాస్టార్ చిరంజీవి.. పవన్ కళ్యాణ్ రివీల్ చేసేశారు..
చిరు రాజకీయాల్లోకి పున:ప్రవేశంపై పవన్ కళ్యాణ్ తన మనసులోని మాట చెప్పేశారు. చిరంజీవి నైతిక మద్దతు తనకెప్పుడూ ఉంటుందని కుండ బద్దలు కొట్టేశారు.

చిరు రాజకీయాల్లోకి పున:ప్రవేశంపై పవన్ కళ్యాణ్ తన మనసులోని మాట చెప్పేశారు. చిరంజీవి నైతిక మద్దతు తనకెప్పుడూ ఉంటుందని కుండ బద్దలు కొట్టేశారు. అన్నయ్యగా చిరంజీవి తన విజయాన్ని ఎప్పుడూ కోరకుంటారని స్పష్టం చేశారు. చిరంజీవి అందరి మంచి కోరుకుంటాని చెప్పుకొచ్చారు. అయితే చిరు జనసేన పార్టీలోకి వస్తారా లేదా అనే విషయంపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు.
జనసేన పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టబోతున్నారని ఇటీవల ఆ పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పడం రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పవన్‌ను వెనకుండి చిరు నడిపిస్తారని… ఈ మేరకు తమ్ముడికి అండగా ఉంటానని మెగాస్టార్ స్పష్టమైన హామీ ఇచ్చారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. ‘ఎందుకు ఖాళీగా ఉంటున్నావు.. రెండు, మూడు సంవత్సరాలు మూవీస్ చేసుకో. ఆ తర్వాత ఎప్పుడైనా నీ వెనుక నిలబడతాను’’ అని పవన్‌కు చిరంజీవి చెప్పారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దీంతో జనసేన కార్యకర్తలు, అభిమానుల ఆనందానికి హద్దు లేకండా పోయింది.
Also Read: