Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ ఎప్పుడు రైతుల పక్షమే.. రైతు నాయకుల గురించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఏం చెప్పారంటే..
Arvind Kejriwal : సాగు చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం సరైనదే అంటున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ట్విట్టర్ వేదికగా ఆయన

Arvind Kejriwal : సాగు చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం సరైనదే అంటున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ట్విట్టర్ వేదికగా ఆయన మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షానే ఉంటుందని తెలిపారు. భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయిత్.. కేజ్రీవాల్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్‌కు ఆయన బదులిచ్చారు.
రాకేశ్ జీ మేమెప్పుడు రైతుల వెంటే ఉంటామని, మీ డిమాండ్లు సరైనవే అంటూ కితాబిచ్చారు. మీ ఉద్యమాన్ని కించపరచడం, దేశ ద్రోహులుగా చిత్రీకరించడం చాలా తప్పని, రైతు నాయకులపై కేసులు పెట్టడం సరికాదని ట్వీట్‌లో పేర్కొన్నారు. శాంతియుతంగా నిరసనలు వ్యక్తం చేస్తుంటే అరెస్ట్ చేయడం పద్దతికాదని బదులిచ్చారు. ఇక ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఘాజీపూర్ సరిహద్దుకు వెళ్లి రైతుల కోసం ఏర్పాటు చేసిన మంచినీటి కేంద్రాలు, టాయిలెట్లను పరిశీలించారు. గణతంత్ర దినోత్సవం నాడు దిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. దీంతో రైతులు సరిహద్దులను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది.
राकेश जी, हम पूरी तरह से किसानों के साथ हैं। आपकी माँगे वाजिब हैं। किसानों के आंदोलन को बदनाम करना, किसानों को देशद्रोही कहना और इतने दिनों से शांति से आंदोलन कर रहे किसान नेताओं पर झूठे केस करना सरासर ग़लत है। https://t.co/B20DILWzy3
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 29, 2021