Corona Vaccine: మరో కరోనా టీకా ట్రయల్స్‌కు సిద్ధమవుతున్న సీరం ఇనిస్టిట్యూట్‌.. అనుమతుల కోసం ఎదురు చూపు

Corona Vaccine: దేశంలో వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతుండగా, తాజాగా మరో వ్యాక్సిన్‌పై స్థానిక క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ప్రముఖ టీకా ఉత్పత్తి..

Corona Vaccine: మరో కరోనా టీకా ట్రయల్స్‌కు సిద్ధమవుతున్న సీరం ఇనిస్టిట్యూట్‌.. అనుమతుల కోసం ఎదురు చూపు
Follow us
Subhash Goud

|

Updated on: Jan 30, 2021 | 5:46 AM

Corona Vaccine: దేశంలో వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతుండగా, తాజాగా మరో వ్యాక్సిన్‌పై స్థానిక క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ప్రముఖ టీకా ఉత్పత్తి సంస్థ సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించి భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతులు కోరినట్లు సీరం సీఈవో అదర్‌ పూనావాలా వెల్లడించారు. అయితే ఆ టీకాను అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థ అభివృద్ధి చేసింది. ఇప్పటికే యూకేలో నిర్వహించిన ట్రయల్స్‌లో తమ టీకా సామర్థ్యం 89.3 శాతంగా తేలినట్లు నోవావాక్స్‌ తెలిపింది. అలాగే కొత్తగా వెలుగు చూసిన యూకే కొత్తరకం స్ట్రెయిన్‌ వైరస్‌ను కూడా తమ టీకా కట్టడి చేయగలదని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్లు తెలిపింది.

టీకా తయారీ నిమిత్తం ఈ సంస్థతో ఇది వరకే సీరం సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. నిబంధనల ప్రకారం భారత్‌లో స్థానిక ట్రయల్స్‌ నిర్వహించేందుకు దరఖాస్తు చేసుకున్నామని, అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని సీరం సీఈవో పునావాలా తెలిపారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ నుంచి నెలకు 40 నుంచి 50 మిలియన్ల డోసుల నోవావాక్స్‌ వ్యాక్సిన్‌ను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే సీరం సంస్థ ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌ టీకాను ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సినేషన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు పంపిణీ చేస్తోంది.

Africa Corona Vaccine: ఆఫ్రికాకు చేరిన మరో 40 కోట్ల ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ డోసులు