AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Israeli Embassy Blast: తామంతా క్షేమంగానే ఉన్నాము.. ఢిల్లీ పేలుడుపై స్పందించిన ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం

Israeli Embassy Blast: దేశ రాజధాని ఢిల్లీలో ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుడుపై ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం స్పందించింది. పేలుడు ఘటనలో తమంతా..

Israeli Embassy Blast: తామంతా క్షేమంగానే ఉన్నాము.. ఢిల్లీ పేలుడుపై స్పందించిన ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం
Subhash Goud
| Edited By: Pardhasaradhi Peri|

Updated on: Jan 30, 2021 | 9:22 AM

Share

Israeli Embassy Blast: దేశ రాజధాని ఢిల్లీలో ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం వద్ద జరిగిన పేలుడుపై ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం స్పందించింది. పేలుడు ఘటనలో తమంతా క్షేమంగానే ఉన్నామని, అప్రమత్తంగానే ఉన్నామంటూ రాయబార అధికారులు స్పష్టం చేశారు. పేలుడు నేపథ్యంలో ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటునే ఉన్నామని రాయబార కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలోని అబ్దుల్‌ కలాం రోడ్డులో ఉన్న ఇజ్రాయిల్‌ రాయబార కార్యాలయం సమీపంలో ఈ పేలుడు జరిగింది. ఈ పేలుడుకు పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. గణతంత్ర దినోత్సవం బీటింగ్‌ రిట్రీట్‌కు కిలోమీటర్‌ దూరంలో ఈ ఘటన జరగడం ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఘటన స్థలానికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్‌ పోటీసులు, స్పెషల్‌ స్వ్కాడ్‌ పేలుడుపై ఆధారాలను సేకరిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, సెంట్రల్‌ ఇండస్ట్రీయల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ దేశ వ్యాప్తంగా హైఅలర్ట్‌ ప్రకటించింది. ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని విమానాశ్రయాలు, ప్రభుత్వ భవనాలు లాంటి ముఖ్య ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మ‌రోవైపు ఇజ్రాయిల్‌ విదేశాంగ మంత్రితో కేంద్ర విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్‌ ఫోన్‌లో మాట్లాడారు. పేలుడు ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు.

Amit Shah Tour Cancels: ఢిల్లీ పేలుడుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పశ్చిమబెంగాల్‌ పర్యటన రద్దు

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..