ప్రైవేటు క్లినిక్‌లు నడుపుకుంటూ తమాషాలు చేస్తున్నారా..? వైద్యులపై మంత్రి చెడుగుడు.. డాక్టర్ల గుస్సా
ఏపీలో మంత్రి వర్సెస్ వైద్యులుగా మారింది సీన్. రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తీరుపై అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు..
ఏపీలో మంత్రి వర్సెస్ వైద్యులుగా మారింది సీన్. రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తీరుపై అనంతపురం జిల్లా పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు సుకన్య కంటతడి పెట్టడం చర్చనీయాంశంగా మారింది. సిబ్బంది కొరత ఉన్నా కష్టపడి సేవలు అందిస్తున్న తమపై మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై వైద్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో నీళ్ల సమస్యతో ఇరుగు పొరుగు వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వైసీపీకి చెందిన వెంకటేశ్, తరుణ్ గాయపడ్డారు. వీరు అదే రాత్రి 11.30 గంటలకు పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. వీరిని పరామర్శించేందుకు మంత్రి శంకర్ నారాయణ ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో వైద్యుల విధులు, ఆసుపత్రి సౌకర్యాలపై ఆరా తీశారు. అక్కడున్న వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆస్పత్రిలో డ్యూటీ సమయంలో మీరు విధు లు నిర్వహించకుండా ఏం చేస్తున్నారు? వార్డుల్లో కరెంటు లేదు, ఫ్యాన్లు పనిచేయట్లేదు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మీరు చేసే వైద్యం ఇదేనా? మిమ్మల్ని సస్పెండ్ చేయిస్తా. జాగ్రత్త!’ అంటూ ఓ వైద్యురాలిపై రోడ్లు భవనాలశాఖ మంత్రి శంకరనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ బాబు బుడేనను కలిసి రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, ఆస్పత్రిలో మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అక్కడే డ్యూ టీలో ఉన్న వైద్యురాలు సుకన్యతో మాట్లాడుతూ ‘రాత్రి మీరు డ్యూటీలో లేకుండా ఏం చేస్తున్నారు, గాయపడి వచ్చిన వారిని పలకరించే దిక్కేలేదన్నారు.
నేను ఫోన చేసినా సమాధా నం లేదు. వార్డుల్లో కరెంటు లేదు, ఫ్యాన్లు పనిచేయట్లేదు. రోగులకు మీరు కల్పిస్తున్న సౌకర్యాలు ఇవేనా’ అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్య క్తం చేశారు. బదిలీ చేయిస్తే మళ్లీ డిప్యూటేషనపై ఇక్కడికి వస్తారు, ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారనీ, సస్పెండ్ చేస్తేగానీ బుద్ధి రాదంటూ డీసీహెచ్‌ఎస్ రమేష్‌నాథ్‌కు ఫోన్‌చేసి, విధి నిర్వహణలో నిర్ల క్ష్యం చేస్తున్న డాక్టర్ సుకన్యను వెంటనే సస్పెండ్ చేయాలనీ, ఇతర వైద్యులకు షోకాజు నోటీసులు జారీ చేయాలని హుకుం జారీ చేశారు. ఈ పరిణామంపై అక్కడే ఉన్న డా.సుకన్య బోరున విలపించారు.
మంత్రి తీరుపై సూపరింటెండెంట్ బాబు బుడేన నిరసన వ్యక్తం చేశారు. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నాం.. బదిలీలు, సస్పెన్షన్లకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆస్పత్రిలో ఆరుగురు వైద్యులు ఉండాల్సి ఉండగా ఇద్దరమే ఉన్నాం. కష్టపడి 24గంటలు పని చేస్తు న్నాం. జిల్లాస్థాయిలో పెనుకొండ ఏరియా ఆస్పత్రి పని తీరులో రెండోస్థానంలో ఉంది. ఆస్పత్రిలో పాత భ వనాల కారణంగా కరెంటు వైరింగ్ దెబ్బతిని కరెంటు లేక ఫ్యాన్లు పనిచేయడం లేదు. ప్రస్తుతం కొత్త భవనాలు నిర్మిస్తున్నారు. ఇంత కష్టపడి పనిచేస్తున్నా మాటలు పడాల్సి రావడం బాధాకరం. మా పనితీరు నచ్చకపోతే బదిలీ చేసినా, సస్పెండ్ చేసినా మేము సిద్ధమేనని తెలిపారు.
Read More:
అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులో తేల్చేసిన బీఏసీ.. ఆ నిర్ణయంపై ప్రతిపక్షాల అభ్యంతరం
వారు ప్రచారం చేసిన ప్రతిచోటా ఆ పార్టీ ఒడిపోయింది.. ఇక వారి చరిత్ర ముగిసింది -మంత్రి అప్పలరాజు