తాడిపత్రిలో రసవత్తరంగా చైర్మన్ ఎన్నిక.. టీడీపీ, వైసీపీలకు సమానబలం.. కీలకంగా మారిన ఎక్స్‌ అఫీషియోలు

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ సత్తా చాటింది. మెజార్టీ మున్సిపాల్టీలను గెల్చుకుని తన బలాన్ని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి..

తాడిపత్రిలో రసవత్తరంగా చైర్మన్ ఎన్నిక.. టీడీపీ, వైసీపీలకు సమానబలం.. కీలకంగా మారిన ఎక్స్‌ అఫీషియోలు
Follow us
K Sammaiah

|

Updated on: Mar 16, 2021 | 8:50 AM

ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ సత్తా చాటింది. మెజార్టీ మున్సిపాల్టీలను గెల్చుకుని తన బలాన్ని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో టీడీపీ 18 వార్డుల్లో విజయం సాధించగా, వైసీపీ 16 వార్డుల్లో గెలుపొందింది. అయితే, ఎక్స్ అఫీషియో ఓట్లతో చైర్మన్ పీఠాన్ని దక్కించుకోవచ్చని వైసీపీ భావించింది.

అయితే తాము ఓటింగులో పాల్గొంటామంటూ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, వైసీపీ తరపున ఓటు వేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఇక్బాల్, వెన్నపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి చేసిన విజ్ఞప్తిని తాడిపత్రి పురపాలక సంఘం ఎన్నికల అధికారి నరసింహప్రసాద్‌రెడ్డి తిరస్కరించారు. పురపాలక సంఘం నిబంధనల మేరకే తిరస్కరించినట్టు ఆయన తెలిపారు. దీంతో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠగా మారింది.

అయితే, ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రం ఎక్స్ అఫీషియో ఓటు వేసేందుకు అర్హులని చెప్పడంతో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎంపీ తలారి రంగయ్య ఓట్లతో వైసీపీ బలం 18కి పెరిగింది. టీడీపీ బలం కూడా 18 కావడంతో ఇరు పార్టీల బలాలు సమానమయ్యాయి. దీంతో ఇక్కడి నుంచి గెలిచిన సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరిపైకి అందరి దృష్టి మళ్లింది. ఇప్పుడు వీరిద్దరు ఎటువైపు నిలిస్తే వారికే చైర్మన్ పీఠం దక్కుతుంది. మరోవైపు, ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు టీడీపీ తమ కౌన్సిలర్లు అందరినీ ప్రత్యేక శిబిరానికి తరలించింది.

తాడిపత్రి ఎక్స్‌అఫిషియో ఓట్ల కేటాయింపులో ట్విస్ట్‌ చోటుచేసుకుంది. నలుగురు ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో ఓటును ఈసీ తిరస్కరించింది. టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఇక్బాల్‌, గోపాల్‌రెడ్డి, శమంతకమణి దరఖాస్తులను ఈసీ తిరస్కరించింది. తాడిపత్రిలో ఓటు హక్కు లేనందున ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో తిరస్కరించారని.. ఓటు హక్కు ఉన్న చోటే సభ్యత్వం ఉంటుందని కమిషనర్‌ తెలిపారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి, అనంతపురం ఎంపీ రంగయ్యకు ఎక్స్‌అఫిషియో ఓట్లు జారీ అయ్యాయి. 18న తాడిపత్రి మున్సిపల్ సమావేశానికి హాజరుకావాలని అధికారులు లేఖ రాశారు.

టీడీపీకి తాడిపత్రి ఓటర్లు పట్టం కట్టడం వెనుక సీనియర్‌ నాయకుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కృషి ఉందనే భావన వ్యక్తం అవుతుంది. తాడిపత్రి వీధుల్లో కాలినడకన ‘సేవ్‌ తాడిపత్రి’ అనే నినాదంతో ఓటు కోసం ఆయన పరితపించిన తీరు ఆ పట్టణ వాసులను ఆలోచింపజేసింది. ఆ నినాదమే తాడిపత్రిలో టీడీపీ విజయానికి బాటలు వేసింది. తాడిపత్రి అభివృద్ధిని కాంక్షించే జేసీ కుటుంబానికి అండగా తామున్నామనే సంకేతాలను తాడిపత్రి పట్టణ ఓటర్లు మున్సిపల్‌ ఎన్నికల్లో చూపించారనే టాక్‌ వినిపిస్తుంది.

Read More:

ప్రైవేటు క్లినిక్‌లు నడుపుకుంటూ తమాషాలు చేస్తున్నారా..? వైద్యులపై మంత్రి చెడుగుడు.. డాక్టర్ల గుస్సా

వారు ప్రచారం చేసిన ప్రతిచోటా ఆ పార్టీ ఒడిపోయింది.. ఇక వారి చరిత్ర ముగిసింది -మంత్రి అప్పలరాజు

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..