AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరసనలతో దద్దరిల్లిన ఉమ్మడి ఆదిలాబాద్‌.. ఓ పక్క రైతుల నిరసనలు.. మరోపక్క ఏజెన్సీ షెడ్యూల్డ్‌ కులాల జేఏసీ దీక్షలు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నిరసనలతో దద్దరిల్లింది. ఓ పక్క రైతులు, మరో పక్క ఏజెన్సీ షెడ్యూల్డ్‌ కులాల జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం..

నిరసనలతో దద్దరిల్లిన ఉమ్మడి ఆదిలాబాద్‌.. ఓ పక్క రైతుల నిరసనలు.. మరోపక్క ఏజెన్సీ షెడ్యూల్డ్‌ కులాల జేఏసీ దీక్షలు
Adb Nirasana
K Sammaiah
|

Updated on: Mar 16, 2021 | 9:26 AM

Share

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నిరసనలతో దద్దరిల్లింది. ఓ పక్క రైతులు, మరో పక్క ఏజెన్సీ షెడ్యూల్డ్‌ కులాల జేఏసీ తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని లక్సెట్టిపేట ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు బలరావుపేట రైతులు. అధికారులు నిర్లక్ష్యం వీడి డిస్టిబ్యూటర్ నెంబర్ 39,40 లకు సాగునీరు అందించాలని ఇరిగేషన్ కార్యాలయం ముందు బైటాయించారు, ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా మా భూములకు సాగు నీరు అందుతుందని, కానీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా గత వారం రోజుల నుండి నీరు అందక పొలాలు మొత్తం ఎండుతున్నాయని అన్నారు.

వానా కాలం పంటతో చీడపీడల మూలంగా పెట్టుబడులే రాలేదని, నానా కష్టాలుపడి ఏసంగి పంట వేస్తే అధికారుల పర్యవేక్షణలోపం మూలంగా మాకు నీరు అందడం లేదని ఆవేదన చెందారు, రెండు రోజుల క్రితం వినతిపత్రం ఇచ్చినా ఇప్పటివరకు నీటిపారుదల శాఖ అధికారులు చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని , ఇదే పరిస్థితి కొనసాగితే పెద్దమొత్తంలో నిరసన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.

షెడ్యూల్డ్‌ కులాల జేఏసీ రిలే నిరాహార దీక్షలు ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో ఎస్సీ కులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆద్వర్యంలో ఉట్నూర్ ఆర్డిఓ కార్యలయం ముందు రిలే నిరాహార దిక్షలు చేపట్టారు. తాతల కాలంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఏజెన్సీ షెడ్యూల్డు కులాల జేఏసీ అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య డిమాండ్ చేశారు.

ఉట్నూర్ ఆర్డీవో కార్యాలయం ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టి, ఉట్నూర్ ఆర్డీవో కార్యలయంలో సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు గత 8 రోజులుగా ఏజెన్సీ ప్రాంత ఎస్సీల సమస్యల కోసం ఏజెన్సీ ఎస్సీ రైతులు, దళిత నాయకులు రిలే నిరాహార దిక్షలు చేస్తున్నప్పటికీని ప్రభుత్వం గాని అధికార పార్టీ నాయకులుగాని స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. దళితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏజెన్సీ షెడ్యూల్డ్ కులాల జెఎసి ఆద్వర్యంలో ఉట్నూర్ ఆర్డిఓ కార్యలయం ముందు రిలే నిరహార దిక్షలు చేపట్టడం జరిగిందని అన్నారు.

తమ న్యాయమైన డిమాండ్లైనటువంటి ఏజెన్సీలో నివసిస్తున్న ఎస్సిలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామిలను నెరవెర్చాలని దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న ముఖ్యమంత్రి ఏజెన్సీ దళితులకు మూడేకరాలకు బదులు 30 లక్షల రుపాయల ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించాలని, ఏజెన్సీ ప్రాంతంలో తాతల కాలంగ సాగు చేస్తున్న భూములకు ఆన్లైన్ హక్కు పత్రాలు ఇచ్చి రైతు బందు పథకం వర్థింపజేయాలని, భారత రాజ్యాంగం ప్రకారం ఏజెన్సీలో ఎస్సిలకు ప్రకారం 15% విధ్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఎస్సి మహిళలకు ఎస్సి కార్పోరేషన్ ద్వారా ఎలాంటి బ్యాంకు లింకెజి లేకుండా రుణ సధుపాయాన్ని కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.