AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister KTR: ఎన్ని కోట్ల కొలువులిచ్చారో లెక్క చెప్పండి.. బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ..

బండి సంజయ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. బీజేపీది నిరుద్యోగ దీక్ష కాదు.. దీక్ష అంటూ ఫైరయ్యారు. తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు.

Minister KTR: ఎన్ని కోట్ల కొలువులిచ్చారో లెక్క చెప్పండి.. బండి సంజయ్‌కు మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ..
Ktr
Sanjay Kasula
|

Updated on: Dec 26, 2021 | 10:15 AM

Share

TRS – BJP: బండి సంజయ్‌కు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ బహిరంగ లేఖ రాశారు. బీజేపీది నిరుద్యోగ దీక్ష కాదు..సిగ్గులేని దీక్ష అంటూ ఫైరయ్యారు. తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందన్నారు. మరి దేశంలో నిరుద్యోగ యువతకు కేంద్రం ఏం చేసిందో సమాధానం చెప్పాలన్నారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులిచ్చారో లెక్క చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ ఏమైందని.. కేంద్రం వల్ల తెలంగాణకు దక్కిన జాబ్‌లెన్నో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐటీ జాబ్స్‌కు గండికొట్టి యువత నోట్లో మట్టికొట్టారు.. మళ్లీ సిగ్గులేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్త వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. ప్రపంచమంతా కరోనా సంక్షోభ సమయంలో 20లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ మీది కాదా.. ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం కానీ మీరు అదికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఖాళీలపైన ఒక శ్వేపపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ మండి పడ్డారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా..? బూటకపు దీక్షకు పూనుకున్న మీరు రాష్ట్ర యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టించే కుట్రనే ఈ దొంగ దీక్ష అంటూ విమర్శించారు.

చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అంటూ ఫైర్ అయ్యారు. హామీ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన మా ప్రభుత్వాన్ని కాదు, లక్షలాది ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టిన మీ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలి.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15లక్షల ఖాళీలను ఎందుకు ఇంకా భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలి.

ఇవి కూడా చదవండి: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..

Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..