Uttar Pradesh Elections 2022: యూపీ ఎన్నికలపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి దిగిన బీజేపీ వ్యూహకర్త..
ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ రాష్ట్రంలో బీజేపీ తన పెద్ద నేతలను రంగంలోకి దింపింది. మరోవైపు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ వ్యూహకర్త అమిత్ షా ఇవాళ ఒరై ఆఫ్ జలౌన్‌లో భారీ ర్యాలీలో..

ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఆ రాష్ట్రంలో బీజేపీ తన పెద్ద నేతలను రంగంలోకి దింపింది. మరోవైపు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ వ్యూహకర్త అమిత్ షా ఇవాళ ఒరై ఆఫ్ జలౌన్‌లో భారీ ర్యాలీలో ప్రసంగించనున్నారు. ఆదివారం తొలిసారిగా జిల్లాకు వస్తున్న హోంమంత్రి అమిత్ షా, అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ చేపట్టిన యూపీ మిషన్‌ను ఒరై గడ్డ నుంచి మొదలు పెట్టనున్నారు. ఇప్పటి వరకు ప్రధాని మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు పెద్ద నేతలు బుందేల్‌ఖండ్‌కు వచ్చారు. ఇవాళ అదే సమయంలో అమిత్ షా ఈరోజు ఒరై చేరుకోనున్నారు.
బుందేల్‌ఖండ్ బీజేపీకి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. నేటి ర్యాలీలో అమిత్ షా మోడీ-యోగి ప్రభుత్వ విజయాలను వివరించడంతో పాటు ప్రత్యర్థులను టార్గెట్ చేస్తారు. ఇవాళ ఒరాయిలో జరిగే ర్యాలీకి లక్ష మంది చేరుకుంటారని బీజేపీ అంచనా వేస్తోంది. దీంతో పాటు అమిత్ షా ర్యాలీని కూడా సోషల్ మీడియాలో లైవ్ చేయనున్నారు.
జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది
ప్రస్తుతం హోంమంత్రి షాకు స్వాగతం పలికేందుకు ఓరై సిద్ధమైంది. హోంమంత్రి అమిత్ షా కార్యక్రమంలో మొత్తం అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పాల్గొంటున్నారు. పరిపాలన అధికారులు శనివారం రోజంతా సన్నాహాలను ముగించడంలో నిమగ్నమయ్యారు. అమిత్ షా రాకపై స్థానిక బీజేపీ నేతలు హోర్డింగ్‌లు, బ్యానర్‌లతో నగరాన్ని హోరెత్తించారు.
ఇవి కూడా చదవండి: New Year Recipe: న్యూ ఇయర్ వేడుకల్లో మోజారెల్లా స్టిక్స్ మీ కుటుంబ సభ్యులను ఖుష్ చేయండి.. వీటి ఇలా ట్రై చేయండి..
Trending Video: అయ్యో..! ఆపదలో పప్పి.. చూసిన మరో కుక్కపిల్ల ఏం చేసిందో తెలుసా..