ప్రతి రోజూ ఉదయం ఒక అరటి పండు తింటే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా?
samatha
23 march 2025
Credit: Instagram
ప్రతి రోజూ ఒక అరటి పండు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా ప్రతి ఉదయం ఒక అరటి పండు తినడం వలన జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, మూత్రపిండాల ఆరోగ్యంనికి కూడా ఇది చాలా మంచిదంట.
అరటి పండులో పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి అధికంగా ఉంటాయి. అందువలన దీనిని తినడం వలన దీర్ఘకాలికి వ్యాధుల నుంచి బయపటడవచ్చునంట.
అరటి పండులో మంచి పోషక విలువలు ఉంటాయి. అంతే కాకుండా ఇది తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అందువలన ఉదయం అల్పాహారంగా కూడా ఇది మంచి ఎంపిక.
అరటి పండు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందంట. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉండటం వలన దీనిని ప్రతి రోజూ తినడం వలన బరువు ఈజీగా తగ్గవచ్చునంట.
అరటి పండ్లలో ఫ్లేవనాయిడ్స్ అలాగే ఆమైన్‌లతో సహా అనేక రకాల శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అందువలన దీనిని ప్రతి రోజూ తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందంట.
అదే విధంగా అరటి పండులో ఉన్న పోషకాలు గుండె జబ్బులు, అలాగే మాక్యులర్ క్షీణత వంటి ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుందంట. అంతేకాకుండా దీనిని తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట.
అరటి పండ్లను తినడం వలన అందులో లభించే పెక్టిన్ అనే నిర్దిష్ట రకం ఫైబర్, శరీరంలోని వ్యర్థాలను తొలిగించడంలో సహాయపడుతుందంట. అలాగే శరీరానికి తక్షిణ శక్తిని అందిస్తుంది.