RCB vs KKR: మ్యాచ్ అయితే గెలిచారు కానీ, ఈ లోపాలు గమనించారా? ప్రతీసారి అదృష్టం కలిసిరాదు..!
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీలతో రాణించగా, కృనాల్ పాండ్యా, జోష్ హెజెల్‌వుడ్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. అయితే, బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్‌లోని కొన్ని పొరపాట్లు ఆర్సీబీ మెరుగుపరచుకోవాల్సిన అంశాలు. విజయం సాధించినప్పటికీ, భవిష్యత్తు మ్యాచ్‌లలో నిలకడైన ప్రదర్శన అవసరం.

ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో ఆర్సీబీ తలపడింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బౌలింగ్‌లో కృనాల్ పాండ్యా, జోష్ హెజల్‌వుడ్ అద్భతుమైన బౌలింగ్‌లో కేకేఆర్‌ను భారీ స్కోర్ చేయకుండా అడ్డుకున్నారు. 175 పరుగుల చేజింగ్లో ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాజ్ కోహ్లీ ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగి సూపర్ డామినేటింగ్ విక్టరీ సాధించారు. అలాగే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ సైతం మంచి ఎటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి.. ఆర్సీబీ టీమ్ మంచి జోష్ లో ఉంది. ఇక ఆర్సీబీ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిన్న రాత్రి వాళ్లకు పండగే పండగ. ఆర్సీబీ గెలిచింది, కోహ్లీ హాఫ్ సెంచరీతో నాటౌట్‌గా ఉన్నాడు.. ఇంకేం కావాలి వాళ్లకు.
అయితే.. నిన్నటి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచినా.. కొన్ని పొరపాట్లు చేసింది. వాటిని వచ్చే మ్యాచ్‌ల్లో రిపీట్ చేయకుంటేనే వాళ్ల విజయవకాశాలు పెరుగుతాయి. ఈ మ్యాచ్‌లో కలిసి వచ్చినట్లు ప్రతీసారి అదృష్టం కలిసివస్తుందని అనుకోవడానికి లేదు. ముఖ్యంగా బౌలింగ్ మార్పుల విషయంలో ఆర్సీబీ కెప్టెన్ రజత్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎస్.. అతను యంగ్ కెప్టెన్, ఫస్ట్ ఆర్సీబీకి కెప్టెన్సీ చేస్తున్నాడు, అందులోనూ ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచ్, ఆర్సీబీకి ఉన్న క్రేజ్ అతనిపై ప్రెజర్ పెడుతుంది. కానీ, బౌలింగ్ ఛేంజెస్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. నిన్నటి మ్యాచ్‌లో తొలి మూడు ఓవర్లలో ఆర్సీబీ కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చారు. హెజల్ వుడ్ రెండు, యష్ దయాల్ ఒక బౌలర్ కంప్లీట్ చేసుకున్నారు. ఇంత అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే.. దయాల్‌తో స్పెల్ కంటిన్యూ చేయిస్తూ.. నాలుగో ఓవర్ వేయించకుండా సర్‌ప్రైజింగ్‌గా యువ బౌలర్ రసిక్ దార్‌ను ఎటాక్‌లోకి తీసుకొచ్చాడు.
ఇదే ఛాన్స్ అనుకున్న కేకేఆర్ బ్యాటర్లు రహానె, సునీల్ నరైన్.. రసిక్ దార్‌పై ఎటాక్ చేశారు. ఒక్కసారిగా రన్స్ లీక్ అయ్యాయి. అదే ఫ్లోన్‌ను కంటిన్యూ చేశారు బ్యాటర్లు ఫలితంగా పవర్ ప్లే 6 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 60కి చేరింది. మూడు ఓవర్లలో 9 రన్స్ వస్తే, మిగతా మూడు ఓవర్లలో 51 పరుగులు వచ్చాయి. మూమెంటమ్ మొత్తం కేకేఆర్ వైపు మారిపోయింది. ఇలాంటి తప్పులతో పాటు ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఓవర్‌లోనే సుయాష్ శర్మ, క్వింటన్ డికాక్ ఇచ్చిన ఒక సింపుల్ క్యాచ్‌ను వదిలేశాడు. అదే ఓవర్‌లో డికాక్‌ను హెజల్‌వుడ్ అవుట్ చేయడంతో ఆ క్యాచ్ డ్రాప్ పెద్దగా సమస్యగా మారలేదు కానీ, డికాక్ క్రీజ్‌లో ఎక్కువ సేపు ఉంటే ఎలాంటి విధ్వంస సృష్టిస్తాడో తెలిసిందే. సో.. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఆర్సీబీ రిపీట్ చేయకుంటే.. వాళ్లను ఈ సీజన్‌లో అడ్డుకోవడం కష్టమే.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.